అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్రారంభమైంది. ఆదివారం, అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 5 సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ భారత్ నిర్భయంగా ఆడాల్సిన అవసరం ఉందని అన్నారు. సరిగ్గా ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు ప్రపంచకప్‌లో భారత్ ఏ జట్టుకు భయపడకుండా దూకుడుగా, ఆత్మవిశ్వాసంతో ఆడాల్సిన అవసరం ఉందని హార్దిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో ఆడినప్పుడు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నట్లు పేర్కొన్నాడు.

భారత్‌లో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు ఉన్నారని, ప్రపంచకప్‌లో భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉందంటూ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐసీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. పాండ్యాకు ఇది రెండో వన్డే ప్రపంచకప్. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత జట్టులో అతను ఒక కీలక ప్లేయర్ గా ఉన్నాడు.

ప్రపంచకప్‌లో ఆడటం చాలా ఉత్సాహంగా ఉందని, అభిమానుల ప్రేమ, మద్దతు కోసం ఎదురుచూస్తున్నామని భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఈసారి ఇండియాలోనే వరల్డ్ కప్ జరగడం, ఫ్యాన్స్ సపోర్టు ఫుల్ గా లభించడం వల్ల టీమ్ మంచి బూస్ట్ తో బాగా ఆడగలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. "అభిమానుల మద్దతు అనేది జట్టు తమ అత్యుత్తమ క్రికెట్‌ను ఆడేందుకు దోహదపడుతుంద"ని పాండ్యా అభిప్రాయపడ్డాడు.

ఈ భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ ఇంకా మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న జట్టు అని, ఈ ఏడాది ప్రపంచకప్ గెలుస్తామన్న నమ్మకం ఉందన్నాడు. భారతదేశం చాలా కాలంగా నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న జట్టుగా ఉంది. మూడవ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవడానికి తమకు బాగా ఆడటం మాత్రమే అవసరమని పాండ్యా అభిప్రాయపడ్డాడు.

ఇకపోతే ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియాపై తమ గెలుపు-ఓటముల రికార్డును మెరుగుపరుచుకోవాలని కూడా భారత్ చూస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ 12 మ్యాచ్‌లు ఆడగా, ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా ఈసారి వరల్డ్ కప్ నా ముద్దు ఆడాలని టీమిండియా ప్లేయర్లు బాగా ఉవ్విళ్లూరుతున్నారు. అభిమానులు కూడా గెలుపును ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: