
ఈ క్రమంలోనే ఒకప్పుడు స్టార్ క్రికెటర్గా హవా నడిపించినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు లేక నిరాశ చెంది చివరికి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా క్రికెటర్ రిటైర్మెంట్ అనే ఆలోచన చేసి అలాంటి ప్రకటన చేశాడు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ సైతం ఇటీవల ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు వేడుకలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు సునీల్ నరైన్.
ఈ వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ రిటైర్మెంట్ ఆలోచన చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. నా కెరియర్ లో సహకరించిన కుటుంబ సభ్యులు, వెస్టిండీస్ బోర్డు సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్ కు కూడా ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు సునీల్ నరైన్. కాగా వెస్టిండీస్ జట్టు తరఫున 65 వన్డే మ్యాచ్లు, 51 t20 లు, ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు నరైన్. గత కొంతకాలం నుంచి అతను జట్టుకు దూరంగా ఉంటున్నాడు అని చెప్పాలి. చివరిగా 2019లో ఇండియా తో చివరి టి20 ఆడాడు నరైన్. అయితే ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్ తరఫున ఎన్నో ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.