ఇటీవల వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒకటి ఉంది అన్న విషయం తెలిసిందే. అదే ఏకంగా వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్ టీం అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న శ్రీలంక జట్టుపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిషేధం విధించడమే. ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన శ్రీలంక జట్టు దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే వరుస పరాజయాలతో సతమతమై ఇక సెమి ఫైనల్లో అడుగుపెట్టకుండానే నిష్క్రమించింది.


 అయితే ఇలా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక జట్టు సొంత గడ్డపై అడుగు పెట్టిందో లేదో.. ఇక ఐసీసీ తీసుకున్న నిర్ణయం ఆ జట్టు ఆటగాళ్లు అందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి  ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ బోర్డు వ్యవహారాలను చూసుకోవడంలో ఇక లంక బోర్డు పూర్తిగా విఫలమైందంటూ ఐసీసీ ఆరోపణలు చేసింది. అంతేకాదు ఇక క్రికెట్ బోర్డువ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం ఎక్కువ అవడంతోనే ఇలా నిషేధం విధించినట్లు తెలిపింది. అయితే తామే లంక బోర్డుపై  సస్పెన్షన్ విధించాలని కోరినట్లు లంక బోర్డు డిప్యూటీ చైర్మన్ కూడా చెప్పడం సంచలనంగా మారింది.



 ఇలాంటి సమయంలో ఇక శ్రీలంక బోర్డుపై నిషేధం విధించడం గురించి మాట్లాడిన ఆ దేశ మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశాడు. ఏకంగా ఈ వివాదంతో బిసిసిఐ సెక్రటరీ జై షాను ముడిపెట్టాడు  శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐ సెక్రటరీ జై షా కనుసన్నళ్ళో నడుస్తుంది  అతని వల్ల శ్రీలంక క్రికెట్ నాశనమైంది. శ్రీలంకలోని కొంతమంది జై షా మన్ననలు పొందేందుకు లంక బోర్డును నాశనం చేస్తున్నారు. తన తండ్రి హోం మంత్రి కావడంతో జై షా అందరిని చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నాడు అంటూ లంక మాజీ అర్జున రణతంగా  సంచలన ఆరోపణలు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: