బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ సీజన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఎంతో మంది స్టార్ ప్లేయర్లు కోట్ల రూపాయల ధర పలుకుతారు అని. ఇక అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని. అయితే ఇదంతా ఒకవైపు. కాని ఇంకోవైపు చూసుకుంటే ఐపీఎల్ టోర్నీ అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలి అనుకునే ఆటగాళ్లకు ఒక సువర్ణ అవకాశం. ఐపీఎల్ టోర్నీ ఎన్ని కష్టాలు ఎదురైనా క్రికెట్ ను వదలకుండా ఆశయంతో ముందుకు సాగుతున్న ప్లేయర్లకు ఒక మంచి చేయూత. ఐపీఎల్ టోర్నీ కష్టాలు కడలి నుంచి ఎంతోమంది క్రికెటర్లను బయటపడేసే ఒక ఆర్థిక భరోసా.


 అవును ఇది నిజమే.. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎదురైనా క్రికెట్ ఆటే ప్రాణంగా బతికిన ఎంతోమంది యువ ఆటగాళ్లకు అటు ఐపిఎల్ కష్టాలను దూరం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న క్రికెటర్లకు ఐపిఎల్ ద్వారా కోట్ల రూపాయలు దక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కూడా ఇలా ఎంతోమంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కోట్ల రూపాయల ధర పలికారు. కుర్రాళ్లకు అటు ఫ్రాంచైజీలు అన్నీ కూడా పెద్దపీట వేసాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా ఐపీఎల్ వేలంలో 5.80 కోట్ల ధర పలికిన ఒక నిరుపేద క్రికెటర్ కు సంబంధించిన వార్త వైరల్ గా మారింది.



 ఇలా ఫ్రాంచైజీలు తనకోసం పోటీపడేలా చేసిన క్రికెటర్ ఎవరో కాదు యువ ఆటగాడు శుభం దూబే. రాజస్థాన్ రాయల్స్ తరపున సత్తా చాటేందుకు  సిద్ధం అయ్యాడు   అయితే అతను ఈ స్థాయికి చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు  పదేళ్ల క్రితం కనీసం గ్లోవ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. నాగ్ పూర్ లో అతని తండ్రి బద్రి ప్రసాద్ నడిపే పాన్ షాప్ పైన కుటుంబం ఆధారపడింది. అంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన శుభం దూబే ఇక ఇటీవల ఐపీఎల్ వేలంలో 5.80 కోట్ల ధర పలికాడు. ఇక ఇలా ఐపీఎల్ ద్వారా అతను కష్టాల కడల నుంచి బయటపడగలిగాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl