అయితే ఇలా భారత జట్టు తరుపున కూడా అదరగొడుతున్నప్పటికీ అటు రింకు సింగ్ కి మాత్రం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సరైన ధర పెట్టకపోవడం గమనార్హం. అడపా దడప ప్లేయర్లే కోట్ల రూపాయల ధర దక్కించుకుంటుంటే.. అటు రింకు సింగ్ ను మాత్రం 55 లక్షలు మాత్రమే చెల్లించి కోల్కతా ఫ్రాంచైజీ రీటైన్ చేసుకోవడం గమనార్హం. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం ప్లేయర్లు అందరినీ కూడా ప్రోత్సహించేందుకు బీసీసీఐ కొత్త రూల్ తీసుకురాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ తీసుకురాబోతున్న ఈ కొత్త రూల్ ఏకంగా సిక్సర్ల కింగ్ రింకు సింగ్ కొంప ముంచేలాగే ఉంది అని చెప్పాలి.
ఇక ఈ రూల్ ప్రకారం 20 లక్షల కనీస ధరకు ఆడి తర్వాత టీమిండియా తరపున అరంగేట్రం చేస్తే తదుపరి సీజన్లో అతని జీతం 50 లక్షలకు పెరుగుతుంది. ఐదు లేదా తొమ్మిది మ్యాచ్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం భాగిస్తే ఏకంగా 75 లక్షలు అతని వేతనం పెరుగుతుంది. ఒకవేళ పది మ్యాచ్ లు ఆడితే ఇక ఆ ఆటగాడికి కోటి రూపాయల వరకు జీతం అందించేలా బీసీసీఐ రూల్స్ తీసుకొస్తుంది. అయితే ee రూల్ విషయంలో ఒక కిటుకు పెట్టింది బీసీసీఐ. ఒకవేళ ఆటగాడికి 50 లక్షలు పైగా జీతం అందుతూ ఉంటే.. అతనికి ఈ రూల్ వర్తించదు అంటూ తెలిపింది. కాగా ప్రస్తుతం రింకు సింగ్ కి 55 లక్షలు ఇస్తుంది కోల్కతా. దీంతో బీసీసీఐ రూల్ తో అటు రింకు సింగ్ కి నష్టం వాటిల్లనుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి