అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన ప్రతి ఆటగాడు కూడా ఆరంభం లో అదరగొట్టి తన సత్తా ఏంటో ప్రపంచ క్రికెట్కు అర్థమయ్యేలా చేయాలని ఎంతగానో ఆరాట పడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే బ్యాటర్ హాఫ్ సెంచరీ లేదా సెంచరీ కొట్టిన బౌలర్ భారీగా వికెట్లు తీసుకున్న కూడా ఆనందం తో ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది ఆటగాళ్లు  ప్రదర్శనతో కాక పోయినా సంబరాలతో మాత్రం సోషల్ మీడియా లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతు ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 సాధారణం గా ఇలా వికెట్ దక్కించుకున్నప్పుడు ఎగిరి గంతేయడం లేదంటే గట్టిగా అరవడం లాంటివి చేసి ఎంతో మంది బౌలర్లు సంబరాలు చేయడం చూసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది బౌలర్లు మాత్రం విచిత్రమైన రీతిలో తమకు మాత్రమే సాధ్యమైన యూనిట్ స్టైల్ లో సంబరాలు చేసుకుంటుంటారు. ఇక ఇలా ఎవరైనా సెలబ్రేషన్స్ చేసుకున్నారు అంటే చాలు సోషల్ మీడియాలో ఇక అందుకు సంబంధించి వీడియో కాస్త వైరల్గా మారి పోతుంది. ఇప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది.


 ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ లో అరంగేట్రం మ్యాచ్ ఆడాడు వెస్టిండీస్ బౌలర్ కెవిన్ సక్లేర్. అయితే తొలి వికెట్ తీసిన తర్వాత అనూహ్యమైన రీతిలో అతను సంబరాలు చేసుకున్నాడు. ఏకంగా గ్రౌండ్లో గాల్లోకి ఎగురుతూ రెండు పల్టీలు కొట్టి సంబరాలు చేసుకున్నాడు. అయితే అతను చేసిన విన్యాసాలు చూసి సహచర ఆటగాళ్లు కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. బ్రిస్బేన్  వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: