ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీంగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ వ్యవహారం అటు ఐపిఎల్ లో ఎంత హాట్ టాపిక్ గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించే నాయకుడి కోసం ఏ టీం అయినా ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి నాయకుడు దొరికినప్పుడు అతన్ని వదులుకునేందుకు అస్సలు ఇష్టపడదు అన్న విషయం తెలిసిందే. అయితే ఏకంగా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టును ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవడంలో సక్సెస్ అయ్యాడు రోహిత్ శర్మ.


 అతని సారథ్యంలో ఒక సాదాసీదా టీం గా ఉన్న ముంబై ఇండియన్స్ ఏకంగా ఛాంపియన్ టీం గా అవతరించింది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా కూడా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి సారధి ఉన్నప్పుడు మాకు నిజంగా అదృష్టం ఉంది అని.. ఏ ఫ్రాంచైజీ అయినా అనుకుంటుంది. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం ఏకంగా రోహిత్ లాంటి కెప్టెన్ ను తప్పించి హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమించుకుంది. ఇక ఈ విషయాన్ని రోహిత్ అభిమానులే కాదు సగటు క్రికెట్ ప్రేక్షకులు కూడా అసలు జీర్ణించుకోలేకపోయారూ. రోహిత్ లాంటి సారధిని తప్పించడమేంటి అంటూ విమర్శలు కూడా చేశారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను ఆస్థానంలో జట్టు యాజమాన్యం ప్రకటించినప్పటి నుంచి కూడా హార్దిక్ పాండ్యా పై ఇక ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ ట్రోల్స్ పై అటు రోహిత్ గాని ఇటు హార్దిక్ పాండ్యా గానీ స్పందించలేదు. అయితే ప్రస్తుతం తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలిసారి స్పందించాడు. నేను రోహిత్ అభిమానుల బాగోద్వేగాలను గౌరవిస్తాను. కానీ వారిని కంట్రోల్ చేయలేను. వారిని గౌరవిస్తూనే కెప్టెన్ గా నేను ఏం చేయాలో అనే విషయంపై దృష్టి పెడతాను అటు హార్దిక్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: