ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) భాగంగా సూర్య కుమార్ యాదవ్ ... ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో సూర్య కుమార్ వరుసగా గాయాలు పలు కావడంతో కొంత కాలం పాటు ఈయన మ్యాచ్ లకి దూరం అయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ఈయన ఫుల్ ఫిట్నెస్ తో మ్యాచ్ లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే తాజాగా సూర్య కుమార్ స్టార్ బౌలర్ బు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అసలు విషయం లోకి వెళితే ... మ్యాచ్ స్టార్ట్ కాక ముందు బూమ్రా నేను కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ చేశాం. అందులో భాగంగా బూమ్రా వేసిన యార్కర్ లకి నా కాలు పచ్చడి పచ్చడి అయ్యింది. లేదంటే నేను బ్యాట్ విరగొట్టేసేవాడిని. మేమిద్దరం రెండు , మూడేళ్లుగా కలిసి ఆడుతున్నాం. అప్పటి నుండి ఇదే పరిస్థితి. ఈయన వేసే యార్కర్ బంతులకు నా కాళ్లు ఎప్పుడూ దెబ్బతింటూనే ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే స్టార్ బౌలర్ బూమ్రా కూడా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకే ఆడుతున్నాడు. ఇలా వీరిద్దరూ ప్రస్తుతం (ఐ పీ ఎల్) లో భాగంగా ఒకే జట్టుకు ఆడుతున్నారు. నిన్న ముంబై ఇండియన్స్ జట్టు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో తడబడింది. ఇందులో భాగంగా బెంగళూరు పై ముంబై అదిరిపోయే రేంజ్ విక్టరీ ని సాధించింది. సూర్య కుమార్ నిన్నటి మ్యాచ్ లో ఆప్ సెంచరీ తో అద్భుతమైన ఇన్నింగ్స్ ను అడగా ... బూమ్రా తన బౌలింగ్ తో బెంగళూరుకు చుక్కలు చూపించాడు.

ఇలా నిన్న వీరిద్దరి అద్భుతమైన పర్ఫామెన్స్ తో ముంబై ఇండియన్స్ కు అదిరిపోయే రేంజ్ విజయం దక్కింది. ఇక వీరిద్దరూ కూడా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడంతో రాబోయే మ్యాచ్ లలో కూడా ముంబై ఇండియన్స్ ప్రదర్శన అదిరిపోయే రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sky