ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కి వరల్డ్ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతూ ఉంటాయి ఈ రెండు టీమ్స్. అయితే ఈ రెండు జట్ల మధ్య కేవలం క్రికెట్లో మాత్రమే కాదు ఇక సరిహద్దుల వద్ద కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఇక ఇలా ఈ మ్యాచ్ ని హై వోల్టేజ్ మ్యాచ్ అని అంటూ ఉంటారు. అంతేకాదు పాకిస్తాన్, ఇండియా మధ్య క్రికెట్ సంబంధాలపై కూడా నిషేధం కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే అన్ని దేశాల లాగా ఇక పాకిస్తాన్, ఇండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. కేవలం ఐసీసీ టోర్నిలలో మాత్రమే ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్లు జరగడం చూస్తూ ఉంటాం. ఇక ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లడం అస్సలు జరగదు అని చెప్పాలి. అందుకే ఎప్పుడో ఒకసారి జరిగే ఈ దాయాధుల పోరును చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే టి20 వరల్డ్ కప్ జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతూ ఉండగా ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9వ తేదీన జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులందరూ  కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ దాయదుల పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై ఎంతో మంది రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామ్రాన్ ఆక్మల్ జోస్యం చెప్పారు. వరల్డ్ కప్ లో పాకిస్తాన్, ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్లో భారత జట్టు దే విజయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. కాగా పాకిస్తాన్ తరపున కామ్రాన్  53 టెస్టులు, 157 వన్డేలు,  58 t20 మ్యాచ్ లు ఆడారు. దీంతో పాక్ మాజీ లకు ఆ దేశ జట్టుపై అంత నమ్మకం లేకుండా పోయిందా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: