మరి కొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా ఇక ఈ ప్రపంచకప్ టోర్నీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో దాదాపు 20 జట్లు పాల్గొంటున్నాయి.  ఇక టి20 ఫార్మాట్లో జరగబోయే ఈ పోరు ఎలా ఉంటుంది అనే విషయంపై ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగానే వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న జట్లు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి. అయితే టి20 ఫార్మాట్ లో ఒక్కసారి వరల్డ్ ఛాంపియన్గా కొనసాగుతున్న భారత జట్టు కూడా ఈసారి ఇక టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతుంది.


 ఇప్పటికే టీం ఇండియా ఆటగాళ్లు అందరూ కూడా అమెరికా చేరుకుని ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి ఐసీసీ టోర్నిలలో కప్పు గెలవడంలో వెనుకబడిపోతున్న టీమిండియా.. ఇక ఈసారి టి20 వరల్డ్ కప్ లో టైటిల్ విజేతగా నిలుస్తుందా లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తెగ రివ్యూలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో  టి20 ఫార్మాట్లో జరిగే వరల్డ్ కప్ లో ఇన్నేళ్లలో టీమిండియా ప్రస్థానం ఎలా కొనసాగింది అనే విషయంపై కూడా చర్చించుకుంటున్నారు.


 ఆ వివరాలు చూసుకుంటే.. 2007లో జరిగిన తొలి t20 వరల్డ్ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా ధోని కెప్టెన్సీలో బలిలోకి దిగిన భారత జట్టు విశ్వ విజేతగా అవతరించింది. కానీ ఆ తర్వాత టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా మూడు ప్రపంచ కప్ టోర్నీలలో సెమీఫైనల్ కు కూడా చేరలేకపోయింది. ఇక 2014లో ఫైనల్లో అడుగుపెట్టినప్పటికీ చివరికి శ్రీలంక చేతిలో ఓటమి పాలు అయ్యింది. ఇక ఆ తర్వాత 2016లో, 2022 లోను సెమీఫైనల్ లో వరకు వెళ్లి పరాజయం పాలయింది. 2021 లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్ లోనే టోర్ని నుంచి నిష్క్రమించింది. ఇలా 2007లో జరిగిన మొదటి ప్రపంచ కప్ లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆ తర్వాత మాత్రం ప్రపంచ కప్ అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: