గతంలో విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు సెలెక్టర్లు అర్ధాంతరంగా కెప్టెన్సీ అప్పగించిన సమయంలో ఇలాగే గ్రూపులు ఏర్పడ్డాయి అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత బుమ్రాను కాదని హార్థిక్ పాండ్యాకు తాత్కాలిక కెప్టెన్గా అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఇలాగే గ్రూపుల వ్యవహారం తెరమీదకి వచ్చింది. అయితే ఇప్పుడు టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ ని ఎంపిక చేయడంతో మరోసారి ఇదే అంశంపై చర్చ జరుగుతూ ఉంది. కాగా ఈ విషయంపై భారత జట్టు నూతన t20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు.
టీమిండియాలో గ్రూపులు లేవని భారత టి20 సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు. టి20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి ప్లేయర్లు అంత ఎప్పుడు విడివిడిగా కూర్చోలేదు. టీం గానే ఉంటున్నామ్ అంటూ సూర్య వెల్లడించాడు. అయితే ఈ విషయాన్ని మాత్రం మాజీ ప్లేయర్ అజయ్ జడేజా, ఆశిష్ నెహ్ర తప్పు పట్టారు. గతంలో జట్టుగా కలిసి కూర్చోలేద.. ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టినట్లు అంటున్నాయ్ అంటూ జడేజా కామెంట్ చేయగా.. ఎందుకు ఇంత టైం పట్టిందిఅంటూ ఆశిష్ నెహ్ర కామెంట్ చేశాడు. ఒక రకంగా గతంలో టీమిండియాలో గ్రూపులు ఉండేవి అనే విధంగానే ఇన్ డైరెక్టుగా కామెంట్ చేశాడు టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.