14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్, 123 టెస్టు మ్యాచుల అనుభవం, 9,230 పరుగులు, 30 సెంచరీలు.. ఈ లెక్కలు చాలు భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఎంత గొప్పోడో చెప్పేందుకు .. గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో ప్ర‌పంచ క్రికెట్ ను శాసించిన కోహ్లీ తాజాగా టెస్ట్ మ్యాచ్‌ల‌కు రిటైర్ అవుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసేశారు. గ‌త కొన్నేళ్లుగా కోహ్లీకి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. కోహ్లీ రిటైర్మెంట్ వేళ‌ కింగ్‌కు దక్కే పెన్షన్ ఎంతనేది కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియా లో డిస్క‌ష‌న్లు చేస్తున్నారు. బీసీసీఐ ఆటగాళ్ల శ్లాబులను బట్టి శాలరీలు, ప్రాతినిధ్యం వహించిన మ్యాచులను బట్టి పెన్షన్ ఇస్తూ ఉంటుంది. ఏ ప్ల‌స్ గ్రేడ్ క‌లిగిన కోహ్లీ బోర్డు నుంచి యేడాదికి రు. 7 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడు. అత‌డు భార‌త జ‌ట్టు తరఫున 123 టెస్టుల్లో ఆడాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన ప్లేయర్లకు నెలకు రూ.70 వేల పెన్షన్ ఇస్తారు.


అర్హుడే అయినా బీసీసీఐ నుంచి ఇప్పుడు కోహ్లీకి పెన్ష‌న్ రాదు.. ఎందుకంటే టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ.. ఇకపై వన్డేల్లో కొనసాగనుండటమే దీనికి కారణం. కోహ్లీకి ఇప్పుడే పెన్షన్ ఇవ్వరు. 50 ఓవర్ల ఫార్మాట్‌కూ గుడ్‌బై చెప్పేసి.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి అతడు బయటకు వచ్చేస్తే నే అప్ప‌టి వ‌ర‌కు విరాట్ కోహ్లీకి పెన్ష‌న్ ఉంటుంది. ఇదిలా ఉంటే రిటైర్మెంట్‌తో కోహ్లీ ఆదాయం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న విరాట్.. ఏ కేటగిరీకి పడిపోతే బోర్డు నుంచి ఏడాదికి రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ మాత్ర‌మే వ‌స్తుంది. అదే బీ కేట‌గిరి కి ప‌డిపోతే రు. 3 కోట్లు మాత్ర‌మే ఇస్తారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: