బుల్లితెరపై ఎక్కువ టీ ఆర్ పీ రేటింగ్ తో నడిచేటువంటి సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల, అత్యంత క్రేజ్ సంపాదించుకున్నాడు. కాని తన తండ్రి మరణించడంతో తన జీవితం ఒక్కసారిగా అతలాకుతలం అయ్యింది. దీంతో  ఈ నటుడు ఏం చేసాడు.. తన జీవితం ఎలా మారిందో తెలుసుకుందాం.

2007 లో చంద్రముఖి నాటిక ద్వారా తన నటనను బుల్లితెరపై మొదలుపెట్టాడు నిరుపమ్. ఆ సీరియల్ తో తన కు మంచి పేరు రావడంతో బుల్లితెరపై నిలదొక్కుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక అదే నాటికలో నటించిన మంజుల అనే నటిని పెళ్లి చేసుకున్నాడు నిరుపమ్. ఇక వీరిద్దరికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు.

ఇక నిరుపమ్ తండ్రి కూడా ఒకప్పుడు మంచి నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. తన తండ్రి పేరు"ఓంకార్ పరిటాల". నిరుపమ్ సినిమాలలో నటించడానికి వెళ్తాను అన్నప్పుడు తన తండ్రి వద్దు అని చెప్పారట. సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం, నేను కూడా చాలా కష్టాలు పడ్డాను.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ కి నన్ను కూడా దూరంగా పెట్టారని ప్రచారం జరిగిందని తెలిపారు. అందుకు గల కారణం ఏమిటంటే.. సినీ ఇండస్ట్రీ లో ఉన్న సమస్యల పై పోరాటం మొదలు పెట్టడంతో, సినీ అవకాశాలను కోల్పోయాడని సినీ వినికిడి. అందుకే నిరుపమ్ కూడా వెండితెర వైపు వెళ్ళడానికి ఇష్టపడలేదు.

నిరుపమ్ చెన్నైలో  MBA పూర్తి చేసుకొని.. హీరో అవ్వాలని ఆశతో తన తండ్రి ఒప్పించాలని హైదరాబాద్ వెళ్లగా.. అదే సమయంలో తన తండ్రి మరణించడంతో తన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆ సమయంలో ఉద్యోగం చేయాలా, తనకిష్టమైన జీవితాన్ని కంటిన్యూ చేయాలా.. అనే ఆలోచనలో పడిపోయాడు నిరుపమ్. అలా ఆ సమయంలో తన తండ్రి యొక్క సోదరుడు సహకారంతో చంద్రముఖి సీరియల్ లో నటించే అవకాశం  వచ్చిందట.

తన తండ్రి కోరుకున్నట్టుగానే బుల్లితెర నటుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతను నటుడిగానే కాకుండా తన తండ్రి లాగే రైటర్ కూడా." నెక్స్ట్ నువ్వే" అనే సినిమాకి కథను అందించాడు నిరుపమ్. ఇక అంతే కాకుండా డాక్టర్ బాబు పేరుతో బాగా పాపులర్ అయిన సీరియల్ కార్తీకదీపం. ముందుగా ఈ నాటికలో నటించడానికి నిరుపమ్ ముగ్గురు ఆర్టిస్టులను పంపించాడు. కానీ వారు సరిగ్గా చేయకపోవడంతో. ఆ ప్రొడ్యూసర్ నిరుపమ్ నే చేయమని అడిగాడట. అలా తను ఆ సీరియల్లో కి అడుగు పెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: