ఇక బుల్లితెర మీద నుంచి బయటికి వచ్చాక పలు చిత్రాలలో నటించిన కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలతో ఫన్నీ వీడియోలతో ఎప్పుడు రచ్చ చేస్తూ ఉంటుంది వర్షిణి. సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. ఆ మధ్య హైపర్ ఆదితో లవ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.తాజాగా మరొకసారి ఇంస్టాగ్రామ్ ఒక వీడియోని షేర్ చేసింది. అందులో సమంత చెప్పిన కర్మ గురించి ఉండగా.. ఇంతకు ఆ వీడియోని షేర్ చేయడానికి కారణం ఏంటా అంటూ పలు రకాలుగా అభిమానులు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమంత పడుతున్న కష్టాలు ఆమె ధైర్యానికి మెచ్చుకునేందుకు ఈ వీడియోను షేర్ చేసింది అంటూ కొంతమంది నేటిజన్లో సైతం తెలియజేస్తూ ఉన్నారు. కర్మ అనేది ఒక బూమరాంగ్. అది మనవల్ని బలంగా కొడుతుంది అంటూ గతంలో చేసిన సమంత కామెంట్స్ ఈ వీడియోని షేర్ చేసింది వర్షిణి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి