సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా తన అందం,  నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. యూట్యూబ్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.  అలా పలు వెబ్ సిరీస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి హనుమంత్ బిగ్ బాస్ ద్వారా ఒక రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను , వీడియోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకొంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది సిరి.

అయితే ఇటీవల బుల్లితెరలో ప్రసారమయ్యే స్టార్ మా పరివార్లో కూడా పాల్గొని సందడి చేసిన సిరి ఆ ప్రోగ్రాం లో మాస్ డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.. స్టార్ మా పరివార్ కార్యక్రమానికి హోస్టుగా శ్రీముఖి చేస్తోంది సిరితోపాటు సన్నీ, ఆర్జే కాజల్, అమ్మ రాజశేఖర్, మానస్, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్ లు పాల్గొని అందర్నీ ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా సిరి కూడా ఒక టాస్క్ లో భాగంగానే మాస్ డాన్స్ వేసింది.  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ డూపర్ హిట్ అత్తారింటికి దారేది సినిమాలోని బాపు గారి బొమ్మ పాటకు ఈమె మాస్ స్టెప్పులేసి దుమ్ము లేపింది.


క్లాస్ స్టెప్పులతో మొదలుపెట్టి ఆ తర్వాత మాస్ స్టెప్ లు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సిరి ఆ తర్వాత తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా తన డాన్స్ తో అందరిని మరొకసారి కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: