తెలుగు బుల్లితెర పై .. నటీనటులు సైతం ఈ మధ్యకాలంలో వివాహ బంధంలోని అడుగు పెడుతూ ఉండగా మరికొంతమంది బ్రేకప్ చెబుతున్నారు.. అలా ఆడియన్స్ కి సైతం నైనిషా రామ్ గా సుపరిచితురాలు అయ్యింది బ్రహ్మముడి సీరియల్ అప్పు. ఈ సీరియల్లో తన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. వాస్తవానికి ఈమె బెంగాలి అమ్మాయి అయినప్పటికీ తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో సహా ఇప్పటికీ చాలా సీరియల్స్ లో నటించింది నైనిషా. ఈ సీరియల్ లోనే మొదట రౌడీ బేబీ గా కనిపించిన ఇమే ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గా మారి మరింత ఆడియన్స్ కనెక్ట్ అయ్యి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది.


నైనిషా తాజాగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెబుతూనే తన బాయ్ ఫ్రెండుని సైతం పరిచయం చేస్తు తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టును సైతం షేర్ చేయడం జరిగింది.. తన జీవితం తన సర్వస్వం, తన బలం ,తన ఆనందం అంతా కూడా తన బాయ్ ఫ్రెండే అంటూ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది నైనిషా.. ఈ ఫోటోలకు సైతం లవ్ ఎమోజీలను జోడించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి తేది ఎప్పుడు అంటూ పలువురు నేటిజన్స్ సోషల్ మీడియాలోనే అడుగుతున్నారు.


ఇంతకు నైనిషా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరంటు పలు రకాలుగా  నేటిజన్స్  ప్రశ్నిస్తూ ఉన్నారు. యాక్టర్ గా బెంగాలీలో పలు చిత్రాలు నటించిన నైనిషా ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కూడా శ్రీమంతుడు, బ్రహ్మముడి, ఇంటిగుట్టు తదితర సీరియల్స్ లో కూడా నటించి బాగా గుర్తింపు సంపాదించుకుంది  నైనిషా.. మొత్తానికి గుడ్ న్యూస్ అయితే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: