చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో యూత్‌ను టార్గెట్‌ చేస్తూ మంచి మంచి ఫీచ‌ర్ల‌తో కొత్త‌ స్మార్ట్‌ఫోన్ల‌ను తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా వివో మ‌రో నూతన స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. వివో వై50 పేరుతో రిలీజ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్ కాంబోడియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ కు సంబంధించి 8 జీబీ + 128 జీబీ వేరియంట్ కు సంబంధించి ప్రీ-సేల్ కూడా స్టాట్ అయింది. వివో వై50 స్మార్ట్ ఫోన్ లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. 

 

పంచ్ హోల్ డిజైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కూడా ఇందులో అందించారు. మ‌రియు  5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఇక దీని ధరలను 249 డాలర్లుగా నిర్ణయించారు. 

 

అలాగే స్టారీ బ్లాక్, ఐరిస్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రియు క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించినట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మిగతా మార్కెట్లలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అతి త్వ‌ర‌లోనే ఇత‌ర మార్కెట్ల‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: