నేటి త‌రానికి వాట్సాప్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వారిలో అత్య‌ధిక శాతం మంది వాట్సాప్‌నే డౌన్‌లోడ్ చేసుకుంటారంటే అతిశ‌యోక్తి కాదేమో. ఈ ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్తి ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తూ యూజ‌ర్ల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం రోజువారి అవ‌స‌రాల‌కు వాట్సాప్‌ను కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీని వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కూడా తమ సర్వీసుల కోసం వాట్సప్ ను యూజ్ చేసుకుంటున్నారు.

 

అంత‌లా వాట్సాప్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు ఇత‌రిత‌ర వాటికి వాట్సాప్ వినియోగం సులువుగా ఉండ‌డంతో చాలా మంది దీన్నే ఎంచుకుంటున్నారు. అయితే వాట్సాప్ మ‌న‌కు తెలియ‌న ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. ఇక వాట్సాప్‌లో నకిలీ లైవ్ లొకేష‌న్స్ పంపిస్తార‌ని మీకు తెలుసా..? అవును! ఇందుకోసం మీరు జిపీఎస్ స్పూఫింగ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ ఫోన్‌లో ముందస్తుగా డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయాలి. 

 

ఇప్పుడు అందులో సెలెక్ట్ మోక్ లొకేష‌న్ యాప్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. త‌ర్వాత‌ గూగుల్ ప్లేస్టోర్ ద్వారా జీపీఎస్ ఎమ్యులేటర్ అప్లికేషన్ ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఓపెన్ చేసి మీరు పంపాలనుకుంటున్న ఫేక్ లొకేషన్ పేరును టైప్ చేసి, జీపీఎస్ ఎమ్యులేటర్‌ ఆన్ చేయండి. ఇప్పుడు వాట్సాప్‌లో మీరు ఎవ‌రికి పంపాలో వారి చాట్ ఓపెన్ చేసి అనంతరం లొకేషన్ మీద క్లిక్ చేయాలి. త‌ర్వ‌త‌ లైవ్ లొకేషన్‌ ను ఎంచుకుని దాన్ని షేర్ చేయండి. ఆ అప్లికేషన్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్నంత సేపు, మీరు ఆ ప్రదేశంలో ఉన్నట్లుగానే చూపిస్తుంది. చాలా మంది ఈ ట్రిక్‌ను యూజ్ చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: