వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్  విడుదల అవ్వడం జరిగింది. ఈ వన్ ప్లస్ నార్డ్ సిరీస్‌ లో భాగంగా ఈ మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ వన్ ప్లస్ 8 టీ కి కాస్త దగ్గరగా ఉంది. అలానే  ఈ ఫోన్ లో  హోల్ పంచ్ డిస్ ప్లేను అందించడం జరిగింది. ఈ ఫోన్‌ లో 5 జీ సపోర్ట్ చేయడం విశేషం.



వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలు లోకి వెళితే... ఇందులో ఒకే ఒక్క వేరియంట్ అందుబాటు లో ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్, స్టీరియో స్పీకర్ అందుబాటులో ఉంది. అలానే దీని ధర విషయం లోకి వెళితే..... 329 యూరోలుగా ( అంటే సుమారు రూ.32,000) గా ఉంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే..... 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ‌తో ఈ ఫోన్ అందుబాటు లో ఉంది. వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5 జీ స్మార్ట్ ఫోన్ రంగుల విషయానికి వస్తే... మిడ్ నైట్ ఐస్ రంగులో ఈ ఫోన్ అందుబాటు లో ఉంది.

ఇందులో 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌ గా ఉంది. మొదటగా ఇవి యూరోప్ ‌లో లాంచ్ అయ్యాయి. ఇవి మన దేశం లో ఎప్పుడు లాంచ్ అవుతాయో మాత్రం తెలియ రాలేదు. మరి కొన్ని రోజులు ఈ ఫోన్ కోసం ఆగక తప్పదు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ ‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 10.5 పై ఈ ఫోన్ పని చేయనుంది.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: