ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.... వెనకవైపు మూడు కెమెరాల సెటప్ కూడా ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే... 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
ఈ ఫోన్ ధర వివరాల్లోకి వెళితే... ఇందులో కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను 1,499 యువాన్లుగా (సుమారు రూ.16,700) నిర్ణయించారు. కలర్స్ విషానికి వస్తే...జాజీ గ్రే, లైట్ బ్లూ మింట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇది ఇలా ఉండగా యాక్సెలరో మీటర్, గైరో సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి