నేటి సమాజంలో టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇక చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక యూజర్లకు అనుగుణంగా కొత్తకొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక సామజిక మాధ్యమాలలో సామాజిక మాధ్యమాల వరుస మారుతోంది. అక్షరాలు, వీడియోల ద్వారా  భావాలను పంచుకోవడానికి మొదటిలో ఫేస్‌బుక్‌ వచ్చాయి. ఇప్పడు ఆడియోల రూపంలో కూడా మన భావాలను పంచుకోవచ్చు. అందుకు ఉపకరించే ఆడియో ఓన్లీ సోషల్‌ ఫ్లాట్‌పాం ‘క్లబ్‌హౌస్‌’. అమెరికాకు చెందిన ఆల్ఫా ఎక్స్‌ప్లోరేషన్‌ కో సంస్థ రూపొందించింది.

అయితే ఇంతకీ క్లబ్‌హౌస్ అంటే ఏంటిది? అనే సందేహాలు అందరికి వస్తుంటాయి. క్లబ్‌హౌస్ అనేది ఒక సామాజిక అనువర్తనం, దీని ప్రధాన విధి వాయిస్ చాట్. ఈ యాప్‌ యాపిల్‌ ఐఓఎస్‌ యూజర్ల కోసం మార్చి 2020లో విడుదలచేశారు. విడుదలైన ఒక సంవత్సర కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని గతవారం అమెరికాలో ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా మనదేశంలో కూడా ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం క్లబ్‌ హౌస్‌ యాప్ విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు.

రష్యా, జపాన్‌, బ్రెజిల్‌లో మంగళవారం నుంచి ఆండ్రాయిడ్‌లో ఈ యాప్‌ పనిచేయనుండగా మన దేశంలో మార్చి 21నుంచి ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో తీసుకొస్తామని క్లబ్‌హౌస్‌ సంస్థ తెలిపింది.  గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌కు సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్స్‌ మొదలయ్యాయి. కాగా 5 వేల మందితో చాట్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ క్లబ్‌ హౌస్‌లో ఉంది.

ఇక దీనిని అమెరికా, యూరప్ దేశాల్లో విపరీతంగా పాపులర్ అవుతున్న వాయిస్ ఆధారిత సోషల్ మీడియా యాప్ ‘క్లబ్ హౌస్’ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఐఓఎస్ ఫోన్లలోనే అందుబాటులో ఉండే ఈ యాప్ను ప్రస్తుతం బీటా టెస్టింగ్ కోసం ఆండ్రాయిడ్కు అందుబాటులో ఉంచారు. ఆశక్తి ఉన్న వినియోగదారులు తమ యాప్ను డౌన్లోడ్ చేసి టెస్టింగ్ చేయాలని ఆ సంస్థ తన బ్లాగ్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: