ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు సరికొత్త ట్రెండ్ గా నిలిచాయి. భారీగా పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు, టెక్నాలజీ కి అనుగుణంగా సరికొత్త అప్డేట్ వాహనాలు వస్తూనే ఉన్నాయి. అందుచేత ఎక్కువగా పెట్రోల్ వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాల ని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు ప్రజలు. దరఖాస్తుల ఎక్కువైనప్పటికీ కూడా వాటి మెయింటెన్ ఖర్చు తక్కువగా ఉండడంతో.. వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు.


అయితే వీటికి ఖచ్చితంగా ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి. అయితే ఆటోమొబైల్ రంగంలోని ఏర్పాటుచేసిన ఈ కార్ల మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లో మాత్రం అక్కడే ఉన్నాయి. అయితే  దీంతో ఈ వెహికల్స్ ఛార్జింగ్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నట్లు గా తెలుస్తోంది. అయితే వీరందరిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వీరికి ఒక శుభవార్త తీసుకువచ్చింది. ఇండియాలో ఉన్న పెట్రోల్ బంకులలో ఈ స్టేషన్ లను అమర్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. దాదాపుగా 70 వేలకు పైగా ఉన్న ఈ పెట్రోల్ బంకుల లో 22వేల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయాన్ని మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలియజేశారు.

ఇక మీదట ఎక్స్ ప్రెస్ హైవే మీద నగరాలలో.. ప్రతి 25 కిలో మీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందని తెలియజేశారు. అది 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల దట. ఇక రాబోయే రోజుల్లో  మూడు కిలో మీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండేవిధంగా చూడబోతున్నామని తెలియజేశారు.

అందుకోసం ఎలక్ట్రిక్ బ్యాటరీ లో ఉపయోగించే లిథియం కు సంబంధించి కొన్ని ఉత్పత్తులు పరిశ్రమలను కూడా ప్రారంభిస్తున్నాము అన్నట్లుగా మహేంద్ర పాండే తెలియజేశారు. ఏడాది పాటు తీసుకుంటున్నట్టు ఇందుకోసం పరిశ్రమలకు దాదాపుగా..18,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు గా తెలియజేశారు.  వీటి తో పాటు రాబోయే రోజుల్లో కార్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: