ఇక ఈ క్రమంలోనే కస్టమర్లను మరింత ఆకర్షించడానికి 84 రోజులు వ్యాలిడిటీ తో పాటు ఎక్కువ డేటాను అందించే విధంగా సరికొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇక ఆ వివరాల విషయానికి వస్తే రూ.1,199.. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు వ్యాలిడిటీ పొందడంతో పాటు ప్రతిరోజూ 3జీబి హైస్పీడ్ ఇంటర్నెట్ ను పొందవచ్చు. దీంతో మొత్తం 84 రోజులకు గాను 252 జీబీ ఇంటర్నెట్ డేటాను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.. ఈ ప్లాన్ తో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందడమే కాకుండా జియో యాప్ లను కూడా ఉచితంగా సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబడింది.
రూ.719 ప్లాన్ తో 84 రోజుల పాటు వ్యాలిడిటీ ని పొందవచ్చు ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారుడికి ప్రతిరోజు 2జీబి హై స్పీడ్ డేటా లభిస్తుంది . మొత్తంగా ఎనభై నాలుగు రోజులకు చూసుకుంటే 128gb లభించడమే కాకుండా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ప్రతిరోజు ఉచితంగా 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.
రూ.666 ప్లాన్ తో 84 రోజులు వ్యాలిడిటీ, ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. టోటల్ గా 126gb ని మనం 84 రోజులపాటు పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి