సోనీ బ్రాండెడ్ మన దేశంలో సరికొత్త స్మార్ట్ బడ్జెట్ గల టీవీ ని విడుదల చేయడం జరిగింది. ఇ స్మార్ట్ టీవి సోనీ బ్రేవియా 32w830 k గూగుల్ స్మార్ట్ గూగుల్ టీవి ని విడుదల చేశారు. ఇక దీని స్క్రీన్ సైజు 32 ఇంచులు ఉంటుంది. ఇది ఒక హెచ్ డి రెడి టెలివిజన్ . అంతే కాకుండా HDR -10 ఫార్మెట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే మన దేశంలో రూ.28,999 రూపాయలుగా నిర్ణయించడం జరుగుతోంది.

డిస్ప్లే ప్యానల్ రిజల్యూషన్ విషయానికి వస్తే..1368X768 పిక్సెల్ కలదు. రిఫ్రెష్ రేట్ 60 గా ఉంటుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ టీవ. సరి కొత్త అప్డేట్ తో ఈ స్మార్ట్ టీవీ పని చేయనుంది. ఇందులో గూగుల్ వాయిస్ సెర్చింగ్ కూడా సపోర్ట్ చేయడమే కాకుండా గూగుల్ టీవీ గా కూడా పనిచేస్తుంది. ఇక ఇందులో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తో పాటుగా అందించనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. వాయిస్ కంట్రోల్ ను కేవలం రిమోట్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు.

ఇక ఇందులో ఇంటిగ్రేటెడ్ క్రోమ్ కాస్ట్, యాపిల్ హోమ్ కి ఫీచర్లు కూడా కలవు. ఇక స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఇందులో 20 W స్పీకర్లు అందుబాటులో కలవు. డాల్బీ ఆడియో, క్లియర్ ఫేజ్ ఫ్యూచర్  తో పాటు మరికొన్ని ఆప్షన్ లో కూడా సోనీ అందిస్తోంది. ఇందులో సరికొత్త టెక్నాలజీని కూడా మార్చినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డస్ట్ అండ్ హ్యుమిడిటీ ప్రొటెక్షన్ కలదు. ఇక ఇందులో 3 HDMI కేబుల్ సపోర్టు కూడా కలవు. ఇందులో ఒక ఇంటర్నెట్ పోర్ట్, 2 ఆడియో ఇన్ పుట్స్,RK పోర్ట్, బ్లూటూత్ ఫైవ్ వైఫై కనెక్ట్ కూడా సదుపాయం కలదు. అయితే గ్రాండ్ గల టీవీలు వాడే వారికి ఇది ఒక చక్కటి అవకాశం లాంటిదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: