ప్రస్తుత కాలంలో అత్యాధునికంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంలో కూడా విస్తృతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆటోమేకర్లు కూడా అధునాతన సేఫ్టీ ఫీచర్లను ప్రవేశపెడుతూ ఉండడం గమనార్హం. ఈ సేఫ్టీ ఫీచర్ల వల్ల.. అనుకోని సందర్భాలలో ప్రమాదాలు జరిగినా సరే ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అందుకే కస్టమర్లు కూడా సేఫ్టీ ఫీచర్ల పైన ఎక్కువగా దృష్టి పెడుతూ అలా ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉన్న వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా ఈ మధ్యకాలంలో కార్లలో UV కట్ గ్లాసెస్ దేశంలోనే డ్రైవర్లకు ముఖ్యమైన భద్రత ఫీచర్ గా మారిన విషయం తెలిసిందే. ఈ గ్లాసెస్ వల్ల హానికరమైన యువీ కిరణాలు కారు లోపలికి వెళ్లకుండా నిరోధిస్తాయి. అంతేకాదు కళ్ళకు రక్షణను కూడా కలిగిస్తాయి. అందుకే సురక్షితమైన డ్రైవింగ్ ను అలవర్చుకోవడానికి ఈ గ్లాస్ ను అమరుస్తున్నారు. ఇకపోతే వీటి పనితీరు విషయానికి వస్తే యూవీ కట్  గ్లాసెస్ సూర్యరశ్మిని గణనీయంగా తగ్గించి తద్వారా డ్రైవర్ కళ్ళపై ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో డ్రైవర్లకు సురక్షితమైన అలాగే మరింత సౌకర్యవంతమైన పరిస్థితులను ఏర్పారించడంలో మొదటి స్థానం వహిస్తాయి

కంటి వ్యాధులు చర్మవ్యాధులు రాకుండా సంరక్షించడమే కాదు సున్నితమైన చర్మం లేదా కళ్ళు కలిగి ఉన్న వారికి ఇవి చాలా ఉపయోగకరంగా మారుతాయి. ఇక అంతే కాదు ఇవి సన్లైట్ ద్వారా వచ్చే హాట్ స్పాట్లను నియంత్రిస్తాయి. తద్వారా కారు లోపల వేడి కూడా తగ్గుతుంది ఇక ఈ కారును మరింత సౌకర్యవంతంగా ఆహ్లాదకరంగా నడపడంలో కూడా చాలా వరకు దోహదపడుతుంది. కారు లోపల ఉండే ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల ఎయిర్ కండిషనింగ్ అవసరాన్ని తగ్గిస్తాయి. అలాగే ఫ్యూయల్ ఆదా తో పాటు మెరుగైన ఇంధన ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. దీంతో కారు మైలేజ్ పెరిగి , ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా డబ్బు కూడా ఆదా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: