పోర్నోగ్రఫీలో పనిచేసే ప్రొఫెషనల్ స్టార్లకు సుఖ వ్యాధులు రాకుండా ఉంటాయా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ పోర్నోగ్రఫీ ఇండస్ట్రీలో పాటించే రూల్స్ తెలుసుకుంటే ఎవరైనా సరే, అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే.. ప్రొఫెషనల్ పోర్న్ స్టార్స్ కావాలంటే చాలా టెస్ట్ లు పాస్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సుఖ వ్యాధుల ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి చాలా టెస్ట్ లు నిర్వహిస్తారు. పోర్న్ ఫిల్మ్ చిత్రీకరించే ముందు తప్పనిసరిగా స్టార్స్ హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందే. ఒకవేళ యాక్టర్స్ కి ఎయిడ్స్/ హెచ్ఐవి వంటి నయం కానీ సుఖ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయితే వారిని శాశ్వతంగా పోర్న్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారు. అటువంటి వ్యాధిగ్రస్తులకు పోర్న్ ఇండస్ట్రీలోకి అసలు అడుగు పెట్టనివ్వరు. ఎయిడ్స్ గానీ హెచ్ఐవి గాని వారిలో ఒకరికి వచ్చినా చాలామందికి సోకే ప్రమాదం ఉంది. కానీ ఒక వ్యాధులు లేనప్పుడు ఎందరితో కలయికలో కలిసిన ఎటువంటి వ్యాధులు సంక్రమించవు.

"అడల్ట్ ఇండస్ట్రీ మెడికల్ అసోసియేట్స్ పి.సి." అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా పోర్న్ స్టార్స్ ని టెస్ట్ చేసేది. 1998లో ప్రారంభమైన ఈ ఆర్గనైజేషన్ 2011 సంవత్సరంలో తమ దగ్గర టెస్ట్ చేయించుకున్న 12 వేల మంది పోర్న్ స్టార్స్ నిజమైన పేర్లను వెల్లడించింది. దీంతో ఈ ఆర్గనైజేషన్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. 14 రోజులకు ఒకసారి కఠినమైన పద్ధతిలో వైద్య పరీక్షలు జరపడం వల్ల సుఖవ్యాధులు ఉన్న వారెవరూ కూడా పోర్న్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సాధ్యపడదు. లైంగిక సంక్రమణ వ్యాధులు లేనివారు మాత్రమే ఈ ఇండస్ట్రీలో పని చేస్తారు కాబట్టి అసురక్షిత శృంగారం చేసినా.. ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా పోర్న్‌స్టార్స్ చాలా ప్రొఫెషనల్ గా, పరిశుభ్రంగా ఉంటారు. ఫిల్మ్ చేసే ముందుగా వారంతా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసిన తరువాతనే పోర్న్ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతాయి.

అయితే కొందరు నిర్లక్ష్యం వహిస్తూ తెలియని వ్యక్తులతో అసురక్షిత శృంగారం చేసి బాక్టీరియల్ ఎస్టీడీలు కొనితెచ్చుకుంటారు. ఇటువంటి ఎస్టీడీలను యాంటీబయాటిక్స్ ఉపయోగించి నయం చేసుకుంటారు. కొందరు స్టార్స్ మాత్రం అవతలి వ్యక్తికి ఎస్టీడీలు ఉన్నాయో లేదో ఖచ్చితంగా తెలుసుకుని ఆ తర్వాత తమ నిర్ణయం తీసుకుంటారు.

ఇకపోతే ఫిమేల్ స్టార్స్ జనన నియంత్రణ, గర్భనిరోధకం, సంతానోత్పత్తి నియంత్రణ వంటి మందులు వాడుతూ గర్భం దాల్చకుండా జాగ్రత్త పడుతుంటారు. కొందరు స్టార్స్ అండాశయాలు లేదా గర్భం తొలగించుకొని పోర్నోగ్రఫీ ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. అయితే చాలా మంది స్టార్స్ మాత్రం మందులు వాడుతూ రుతుస్రావం కూడా రాకుండా నెలకి 30 రోజుల పాటు తమ పని చేస్తూనే ఉంటారు. అయితే పోర్న్ ఇండస్ట్రీలో కాకుండా బయట విచ్చలవిడిగా అసురక్షిత శృంగారం చేసిన పోర్న్ స్టార్స్ మాత్రం ఎయిడ్స్ కొని తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: