ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుంది అని చెప్పడం ఊహకందని   విధంగా ఉంటుంది. మన మధ్య ఉన్న వారు సరదాగా గడిపిన వారు చూస్తూ చూస్తుండ  గానే క్షణాల వ్యవధి లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో సంపాదించడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఎంతో మంది ఎంతో కష్టపడి పోతూ ఉంటారు. కానీ ఉన్నన్ని రోజులు మనసుకు నచ్చింది చేస్తూ సంతోషం గా బ్రతికే ఉన్నామా లేమా అన్నది ముఖ్యం అంటూ ఇలాంటి ఘటనలు  చూసినప్పుడు అర్థమవుతోంది.



 జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి తరహా విషాదకర ఘటన  జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది అని చెప్పాలి. జమ్మూకాశ్మీర్కు చెందిన ఒక కళాకారుడు గణేష్ ఉత్సవాల్లో భాగం గా పార్వతీ వేషం వేసుకుని వేదికపై నాట్యం చేస్తూ కనిపించాడు. తనదైన శైలి లో హావభావాలు ప్రదర్శిస్తూ అందరినీ తన్మయత్వం లో ముంచేశాడు. దీంతో అతన్ని నాట్యానికి మంత్ర ముగ్గులు అయినా  ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూస్తున్నారు. కాగా డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కానీ చుట్టూ చాలా మంది జనాలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.


 ఎందుకంటే అది కూడా డ్యాన్స్ లో భాగమే అని అనుకున్నారు. కానీ అతను ఎంతకీ పైకి లేవకపోయే సరికి శివుని పాత్రధారి అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా చలనం లేదు. దీంతో ఈవెంట్ మేనేజర్లు కూడా వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. అయితే దేశ వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు తరహా ఘటనలు ఎన్నో జరుగుతున్నాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: