ఇప్పటి కాలంలో అయితే ఎంతోమంది జనాలు తమకు నచ్చిన జంతువుని ఇక పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారు. ఇందులో కుక్క, పిల్లి మాత్రమే కాదు పాములు, మొసల్లు, సింహాలు కూడా ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి ట్రెండ్ రాకముందు పెంపుడు జంతువుగా పేరు సంపాదించుకుంది మాత్రం కేవలం శునకం మాత్రమే. కుక్కలకి మిగతా  జంతువుల కంటే కాస్త ఎక్కువగా తెలివి ఉంటుంది అని అంటూ ఉంటారు. అందుకేనేమో మనుషులతో ఇట్టే కలిసిపోతూ ఉంటాయి.


 ఇటీవల కాలంలో ఎంతోమంది ఇష్టమైన పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఇంట్లో వారిలాగానే ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇక ఇలా పెంపుడు కుక్కలు చూపించే ప్రేమ, అవి చేసే అల్లరి, డ్రామా అంతా అంతా కాదు. కొన్ని కొన్ని సార్లు పెంపులు కుక్కలు చేసే డ్రామా చూస్తే వీటికి ఇంత తెలివి ఎలా వచ్చిందబ్బా అని అందరూ ఆలోచనలో పడిపోతూ ఉంటారు. అచ్చం సినిమాల్లో నటించినట్లుగానే ఇక అటు కుక్కలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నటిస్తూ ఉంటాయి. ఇలా కుక్కల నటన చూసినప్పుడు వాటికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువేనేమో అని అనిపిస్తూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు ఒక పెంపుడు కుక్కకు సంబంధించిన ఫన్నీ వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసిన నేటిజన్స్ అందరు కూడా కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. అంతేకాదు కుక్క చేసిన నటనకు ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి. సాధారణంగా సినిమాలో కారు బైక్ యాక్సిడెంట్ సన్నివేశంలో.. బైక్ తగలకపోయినా దెబ్బలు తగిలినట్లుగా నటీనటులు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక కుక్క నిలబడి ఉంది చిన్న రిమోట్ కార్ వచ్చి కాలికి తగిలింది. ఇంకేముంది కాలు విరిగిపోయినట్లుగా నటించడం మొదలుపెట్టింది కుక్క. అంతేకాదు కుంటుకుంటూ నడిచి ఒక్కసారిగా సొమ్మసిల్లి  పడిపోయినట్లుగా యాక్టింగ్ చేసింది. ఇది చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: