ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పలు రకాల సంక్షేమ పథకాలతో పాటు రైతులకు కూడా మంచి జరిగేలా పలు చర్యలు తీసుకుంటున్నారు.తాజాగా చుక్కల భూమిపై నిషేధం ఎత్తివేస్తూ రైతులకు హక్కు పత్రాలను జారీ చేయడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఈ చుక్కల భూముల నిషేధం తీసివేస్తూ ఒక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక సభలో ఆయన ప్రసంగించారు. చుక్కల భూములకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్టుగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు.


దీనివల్ల వేల మంది రైతులకు విముక్తి కల్పించామని తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2,06,171 ఎకరాలలో చుక్కల భూమికి శాశ్వత పరిష్కారం దక్కిందని గతంలో అధికారంలో ఉన్న టిడిపి ఈ భూమిలను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. చంద్రబాబు రైతులను కోలుకోలేని దెబ్బ కొట్టారు. తమ ప్రభుత్వం మాత్రం రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే ఇలాంటి చుక్కలు భూములను నిషేధిత జాబితా నుండి తొలగించడం జరిగింది అంటూ తెలియజేశారు.


చుక్కల భూములపై ఇకమీదట రైతులకు అన్ని హక్కులు ఉంటాయని ఈ భూముల ద్వారా బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చని వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెలుసుబాటు కూడా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు...చంద్రబాబు నాయుడు స్క్రిప్టు ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తున్నారని విమర్శించడం జరిగింది. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ తో ఎవరి డ్రామా వారు బాగా ఆడుతున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారని రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై చాలా ఫైర్ అయ్యారు ఏపీ సీఎం.. వీళ్ళు వచ్చిన రాకున్నా ఈ నాలుగేళ్లు ఎవరు కొన్నారని సీఎం ప్రశ్నించారు.. ముఖ్యంగా చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే అంటూ తెలిపారు .

మరింత సమాచారం తెలుసుకోండి: