బీహార్ కి చెందిన వ్యక్తి పేరు రిత్ సింగ్. ఆయన ఓ క్వారంటైన్ కేంద్రంకి వంటలు చేస్తున్నాడు. కేవలం కరోనా అనుమానితులకు వంటలు చేయడమే కాకుండా వారిని చక్కగా సంతోష పడేలా  ఆయన ప్రయత్నిస్తున్నాడు. నిజంగా ఈయన ఇన్నిరోజులు ఎక్కడ ఉండిపోయాడు తెలియదు కానీ ప్రస్తుతం ఈయన వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈయన కరోనా రోగులను నవ్వించడానికి తన ప్రయత్నంగా డాన్స్ తో వారికి ఆనందాన్ని పంచుకున్నాడు.

 


ఒక తెల్ల బనియన్ వేసుకొని, అలాగే ఒక తెల్ల పంచ కట్టు ఉన్నాడు ఆ వ్యక్తి. అంతేకాదు మెడలో కూడా జంధ్యం కూడా ధరించాడు. ముఖాన విభూతి పెట్టుకొని కనిపించాడు. అతన్ని చూస్తే నిజంగా పంతులు లాగా కనిపిస్తాడు. స్వతహాగా ఆయన జానపద కళాకారుడు కావడంతో తన కళ తిండి పెట్టలేక పోయిన ఆత్మీయులకు దూరంగా ఉంటూ క్వారంటైన్ సెంటర్లో ఉన్న వారికి చక్కటి భోజనం చేసి పెట్టడమే కాకుండా, మంచి వినోదాన్ని కూడా అందిస్తున్నాడు ఆయన.

 


ఇక బాలీవుడ్ పాత సినిమా అయిన పడోసన్ సినిమాలోని ‘ఏక్‌ చతుర్‌ నార్‌’ పాటకు అద్భుతమైన డ్యాన్స్ తో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేసాడు. ఇక పోతే ఆ పాటకు సంబంధించి ముఖంలో హవాబావాలని కూడా పలకరిస్తూ అద్భుతమైన ప్రదర్శన ఆయన ఇచ్చాడు. ఏది ఏమైనా అతనిని " పంతులు డాన్స్ అదుర్స్ " అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 3.5 మిలియన్ల మంది వీక్షించాలంటే అతడి డాన్స్ ఏవిధంగా చేశారో మీరే చూడండి.

 

 

చూశారు కదా ఆ వ్యక్తి చేసిన డాన్స్ ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగా చేశారు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: