సరదాగా ఉండటం అంటే చాలా మందికి చాలా ఇష్టం. ఇక సరదా కోసం రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొందరు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు ఆట పాటలతో ఎంజాయ్ చేస్తూ ఇంకా అనేక రకాలుగా తమ సరదాలు తీర్చుకుంటారు. ఇక మనం ఎలాగైనా ఎంజాయ్ చేస్తూ మన సరదాలను తీర్చుకోవచ్చు.ఇక కొంతమంది పని పాట లేని వాళ్లయితే వ్యూస్ కోసం రకరకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వీడియోలు నేటిజనులకు ఒక్కోసారి ఫన్నీగా అనిపించిన కొన్ని సార్లు కోపం తెప్పిస్తూ ఉంటాయి. ఇక అలా కోపం తెప్పిస్తున్న ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అభం శుభం తెలియని ఓ చిన్న పాపకి బ్యాగ్ లో గింజలు ఇచ్చి కొండముచ్చుల మధ్య వదిలాడు ఓ దుర్మార్గుడు.వదిలి సరదా కోసం వీడియో తీశాడు. ఆ వీడియోలో ఆ చిన్నారి పాప ఆ కొండ ముచ్చులకి గింజలు వేస్తూ వాటి ఆకలి తీరుస్తుంది. ఇది మంచి విషయమే.కాని ఆ గింజలు అయిపోయాక ఆ కొండ ముచ్చులు ఆ పాపని ఇబ్బంది పెట్టాయి. 

ఒక కోతి అయితే ఆ పాపని చేత్తో కొట్టింది. దాంతో ఆ పాప ఏడవటం మొదలు పెట్టింది.ఇక కోతులు కొండముచ్చులు కూడా ప్రమాదకరమైన జంతువులని ఆ పాపకి తెలియదు. కనీసం బుద్ధి జ్ఞానం వున్న ఏ వ్యక్తి కూడా చిన్న పాపని ఇలా జంతువుల మధ్య వదిలేసి వీడియో తీయడు.ఆ వీడియో తీసిన ఆ వ్యక్తికైనా బుద్ధి లేదా అని నెటిజన్స్ ఆగ్రహం చేస్తున్నారు.ఇక అలాగే ఆ వీడియోని షేర్ చేసిన ఆ ఫేస్ బుక్ పేజీ ని కూడా తెగ తిడుతున్నారు.ఇక ఈ వీడియోని తెలుగు NEWJ అనే మీడియా తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసింది.వ్యూస్ లైక్స్ కోసం చిన్న పిల్లల చేత ఇలాంటి ప్రమాదకరమైన జంతువుల మధ్య ఉంచి వీడియోలు చేయించి వారిని ప్రమాదంలో నెట్టకండని ఆ వీడియో తీసిన ఆ వ్యక్తిని అలాగే వ్యూస్ కోసం ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఆ తెలుగు NEWJ మీడియా పేజీని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు.కొందరు అయితే చాలా దారుణంగా తిడుతున్నారు.
 

https://fb.watch/7L6ArjptMo/

మరింత సమాచారం తెలుసుకోండి: