సాధారణం గా సినిమాల గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. ఒక సినిమా తీయాలంటే దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతుంది.. తక్కువ  లో తక్కువ అంటే దాదాపు లక్షల్లో ఒక సినిమా తీయడానికి ఖర్చు అవుతుంది. సినిమా తీయాలంటే కేవలం ఒక వ్యక్తి తో సాధ్యమయ్యే పనికాదు..  సినిమాని తెరకెక్కించాలి డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సినిమాటో గ్రాఫర్ లు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా కోసం పనిచేసే వారు ఎంతో మంది. అంతే కాదు ఎంతో అధునాతనమైన కెమెరాలు వాడుతూ సినిమాను తెరకెక్కిస్తు ఉంటారు.



 ఇలా సాధారణం గా ఒక సినిమా తీయాలంటే భారీ కెమెరాలు తప్పని సరిగా అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సినిమా తీయడానికి కెమెరాలు అసలు అవసరం లేదు అని నిరూపించారు. భారీ కెమెరాలు లేకుండానే సినిమా తీసి చూపించి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కెమెరాలు లేకుండా సినిమా ఎలా తీశారు అని ఆశ్చర్య పోతున్నారు కదా. కేవలం మొబైల్ తో మాత్రమే సినిమా తీసి ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు చిన్నాచితకా షార్ట్ ఫిలిమ్స్ మొబైల్లో  చేయడం చూశాము కానీ.. ఏకంగా ఒక సినిమా తెరకెక్కించడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.


 ప్రస్తుతం సెల్ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కాలానుగుణంగా సెల్ ఫోన్ లో వచ్చిన మార్పులు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల 2024 అనే సినిమా ను ఏకంగా ఫోన్ తోనే షూట్ చేశారు. వన్ ప్లస్ నైన్ ప్రో మొబైల్ లో తెరకెక్కించిన ఫీచర్ మూవీ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేశారు. మొబైల్ లో తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్ చూస్తే ఎక్కడ ఫోన్ లో తీశారు అన్న భావన మాత్రం అస్సలు కలగదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: