స్కై ఒరిజినల్ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ 'స్కౌటింగ్ ఫర్ గర్ల్స్ : ఫ్యాషన్స్ డార్కెస్ట్ సీక్రెట్' టీజర్ ఇపుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ పై రకరకాల కామెంట్లు వినపడుతున్నాయి. కెమెరా వెనుక ఎన్నో నిజాలు దాగి ఉంటాయి అని అయితే అన్ని బయటకు రావు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ లో ఇలాంటివి సర్వ సాధారణం అని చాలా వార్తలే విన్నాం. పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ఈ వార్తల పై స్పందిస్తూ ఇండస్ట్రీ పై ఆరోపణలు చేశారు. ఇదంతా పక్కన పెడితే... ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎంతటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి, ఎలాంటి ఘోర పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు అన్న విషయాల గురించి అప్పటి మోడల్స్ వెల్లడించారు.
 
17 ఏళ్లకే ఎన్నో మోడలింగ్‌ రంగం పై మక్కువతో కొందరు, తప్పనిసరి పరిస్థితుల్లో  కొందరు ఇక్కడ అడుగుపెట్టగా... తమను ఎలా  లొంగదీసుకునేవారు, ఒప్పుకోకపోతే ఎలా పదే పదే బలవంతంగా రేప్ చేసేవారు అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఫొటోగ్రాఫర్స్ కూడా చాలా దారుణంగా బిహేవ్ చేసేవారని ఫోటోషూట్ పేరిట తమని ఇష్టం వచ్చినట్లు హింసించేవరని తెలిపారు. మరియు నూడ్ గా ఉండాలని కోరేవారని టాప్ టూ బాటమ్ డ్రెస్‌లు మొత్తం విప్పేసి నగ్నంగా ఉండమని అడిగేవారు అని వివరించారు. ఇక అమ్మాయి నచ్చిందంటే చాలు మోడలింగ్‌లో రాణించేందుకు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ వారికి ఏ విధంగా సాయం చేసేవారు అన్న విస్తు పరిచే నిజాలను కూడా వెల్లడించారు .

రిలేషన్‌షిప్స్ వర్కౌట్ కాకపోతే ఎంత దారుణంగా బాధించేవారు ఎలా తమ కెరియర్ ని నాశనం చేసే వారు అన్న విషయాలను వివరించారు. ఇలా మోడలింగ్ ఏజెంట్స్‌తో లైంగిక వేధింపులకు గురి కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పలు నమ్మలేని వాస్తవాలను వెల్లడించారు. అయితే చాలా మందికి ఇవన్నీ తెలిసి ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: