చాలా మహిమలు ఉన్న దేవాలయాలు ఎక్కువగా వున్నాయి..ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి అయిన అరసపల్లిలో అద్బుతం జరిగింది.అద్బుత ఘట్టం ఆవిష్కృతమై౦ది. దక్షిణాయణం ప్రారంభం స౦దర్భ౦గా సూర్య కిరణాలు అరసవల్లి ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్ ను తాకాయి.అయితే మబ్బుల కారణంగా గతంతో పోలిస్తే సూర్య కిరణాలు మూల విరాట్ పై పాక్షికంగా ప్రకాశించాయి. రెండు నిమిషాల పాటు స్వామివారి మూల విరాట్ పై సూర్య కిరణాలు ప్రకాశించగా వాటిని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలి వచ్చారు..ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ ని శనివారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఉదయం ఆరు గ౦టల 20 నిమిషాల సమయంలో బంగారు రంగులో లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్ పై రెండు నిమిషాల పాటు ప్రకాశించాయి. ఆలయ గోపురం నుండి గర్బ గుడిలోని స్వామివారి మూల విరాట్ కి మద్య దూరం 350 అడుగులు ఉంటుంది...అంత దూరాన ఐదు ద్వారాలను దాటుకుంటూ స్వామివారిని తాకడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి..వాతావరణంలో ఇతర మార్పులు లేకపోతే రెండోరోజైన ఆదివారం స్పష్టంగానే సూర్య కిరణాలు ప్రకాశించే అవకాశం ఉంటుందని ఆలయ అర్చకులు భావిస్తున్నాచాలారు.సూర్య భగవానుడు ఉత్తారాయణ నుండి దక్షిణాయణం లోకి, దక్షిణాయణం నుండి ఉత్తరాయణం లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతియేట రెండు స౦దర్భాలలో వరుసగా రెండు రోజుల పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్ ని తాకుతూ ఉ౦టాయి. ఆదివారం కూడా వరుసగా రెండోరోజు మూలవిరాట్ పై సూర్య కిరణాలు ప్రకాశించే అవకాశం ఉండటంతో…. వీక్షించే౦దుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అ౦దుకుతగ్గట్టు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసారు.శనివారం కూడా భారీగానే భక్తులు తరలివచ్చినప్పటికీ కేవలం రెండు నిమిషాలు మాత్రమే సూర్య కిరణాలు ప్రకాశించటంతో  మంది భక్తులు ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు..మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: