దీపావళి అంటే ఎన్నో సరదాలను తీసుకొని వస్తుంది..అందుకే ప్రతి ఒక్కరు ఈ పండుగను జరుపుకోవాలని చాలా మంది ఆత్రుతగా ఎదురు చూస్తారు.మన దేశంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగలలో ఒకటి దీపావళి..పిల్లలు,పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దద్దరిల్లేలా జరుపుకోనే పండుగ అని చెప్పాలి.దీపావళి అంటే కేవలం బాంబుల మోతే కాదు.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునే వారికి దీపావళి సరైన రోజు.. అంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి.. లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తుంటారు. దేశ సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తాయి. సంస్కృతితో పాటు చరిత్రను కూడా గుర్తుకు తెచ్చే వేడుక దీపావళి.


అయితే, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం లో రెండు గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి దీపావళి కాగా.. మరో ఊరు అయితే అసలు దీపాలే వెలిగించని గ్రామం.. మరి ఆ గ్రామం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాల్సిందే. అంతే కాదు.. దేశమంతా పండగ జరుపుకునే వేళ ఈ ఊరు మాత్రం దీపాలు వెలిగించకుండా అమావాస్య చీకటిలోనే గడిపేస్తుంది. ఆ చీకటి వెనుకా ఓ కథ దాగి ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెంలో వందల ఏళ్లుగా దీపావళి పండగను జరుపుకోరు. గ్రామంలో అందరూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఏ ఇంట్లోనూ దీపం వెలుగదు ఒక్క టపాసు కూడా పేలదు. స్వీట్ల మాటే వినిపించదు. ఇది ఆ ఊరి కట్టుబాటు. పున్ననపాలెంలో దీపావళిని జరుపుకోక పోవడానికి బలమైన కారణమే ఉంది. 200 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన వల్ల ఆ గ్రామస్తులు దివ్వెల పండగకు దూరమయ్యారు.


అందుకు కారణం కూడా లేకపోలేదు..పున్ననపాలెం గ్రామంలో 200 ఏళ్ల క్రితం దీపావళి, నాగులచవితి రోజున పాము కాటు వల్ల ఊయలలో ఓ చిన్నారని చనిపోయాడట. మరో రెండు ఎద్దులు కూడా మరణించాయి. ఆ రోజు నుంచి గ్రామంలో నాగుల చవితి, దీపావళి పండుగలు జరుపుకోకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించారు..అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ గ్రామంలో పండగ అనేది జరగదు..చదువుకున్న వాళ్లు మూఢనమ్మకాలు పక్కన పెట్టాలని అనుకున్నా కూడా ఎవరూ వినలేదు..ఆనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటించాల్సిందేనని చెబుతున్నారు. అది మూడాఛారమని పోలీసులు, ప్రభుత్వ అధికారులు చెప్పినా.. వినడం లేదు. ఇది సంప్రదాయమని, దాన్నే పాటిస్తామని అంటున్నారు..కానీ యువత మాత్రం ఈ పండుగను జరుపుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: