
ఇక ఇలాంటి వీడియో ఏదైనా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందంటే అది చూసి నెటిజెన్స్ అందరు ఫిదా అవుతూ ఉంటారు. ఇక ఫన్నీ కామెంట్లతో రచ్చ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. కారులో వెళ్తున్న ఒక వ్యక్తికి సినిమా తరహా లోనే పక్కనే రోడ్డుపై ఒక సీన్ తలపించింది. ఈ క్రమంలోనే బైక్ పై వెళ్తున్న వారికి తెలియకుండా సీక్రెట్ గా ఒక వీడియో తీశాడు. ఇక అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి ఒక సూపర్ హిట్ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటున్నారు నేటిజన్స్.
ఇంతకీ ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే.. రద్దీగా ఉన్న రోడ్డుపై ముగ్గురు వ్యక్తులు స్కూటర్ పై ప్రయాణం చేస్తున్నారు. బాలీవుడ్ లో త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్ అనారోగ్యంగా ఉన్న వృద్ధుడైన తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు. అయితే ఎంతకీ అంబులెన్స్ రాకపోవడంతో చివరికి అతనికి ఒక ఐడియా వస్తుంది. వృద్ధుడిని స్కూటీ మధ్యలో కూర్చోబెట్టి నేరుగా ఆసుపత్రిలోకి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తారు. ఇక త్రీ ఇడియట్స్ సినిమాను చూసి స్ఫూర్తి పొందాడో ఏమో కానీ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ అలాంటిదే చేసాడు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని స్కూటీ మధ్యలో కూర్చోబెట్టి.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక ఇది చూసి వాహనదారులందరు కూడా షాక్ అయ్యారు.