ఇక ఇప్పుడు ఒక వధువుకి సంబంధించిన వీడియో కూడా ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియోలో వధువు మేకప్ వేసుకోవడానికి ముందు మేకప్ వేసుకున్న తర్వాత ఆమె ముఖం చూసి ప్రస్తుతం ఇంటర్నెట్ జనాలు మొత్తం షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వీడియోలో కళ్ళు తిప్పుకోకుండా అందంతో మెస్మరైజ్ చేస్తున్న వధువు అసలు అమ్మాయే కాదు. అతను ఒక కుర్రాడు. ఒక అబ్బాయిని మేకప్ ఏకంగా అందమైన అమ్మాయిగా మార్చేసింది. ఇలా అబ్బాయి మేకప్ తో వేషం మార్చిన దృశ్యం కాస్త ప్రస్తుతం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.
దాదాపు 42 సెకండ్ల నిడివి ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక వ్యక్తి ముందుగా తన గడ్డం మీసాలు తొలగించుకోవడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. గడ్డం మీసాలు తొలగించుకున్న తర్వాత లెన్స్ వేసుకొని మేకప్ వేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక మహిళ మేకప్ ఆర్టిస్ట్ సదరు పురుషుడికి మేకప్ వేయడం ఈ వీడియోలో చూడవచ్చు. మేకప్ పూర్తయిన తర్వాత ఇక అతను అబ్బాయి కాదు నిజంగా అమ్మాయి ఏమో అని ప్రతి ఒక్కరికి అనిపించేలా అతను కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.
అయితే ఈ వీడియోలో అతగాడు గడ్డం మీసాలు తీసేసినప్పుడు చూడకపోతే.. మాత్రం వీడియోలో కనిపించింది నిజంగా అందమైన అమ్మాయి అని అనుకునే వారు నేటిజన్స్ అంతలా మేకప్ తో అతని ముఖం మొత్తం మారిపోయింది. కేరళలోని కొల్లం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటిసారి చూస్తే మాత్రం కచ్చితంగా అతను స్త్రీ అని తప్పకుండా అందరూ నమ్మేస్తారు. కొల్లం జిల్లాలో సమయ విళక్కు పండుగను జరుపుకుంటారు. ఇందులో భాగంగా పురుషులు స్త్రీల దుస్తులు ధరించి అచ్చం వారిలాగానే తయారై ఇందులో పాల్గొంటారు.
వారి ఆరాధ్య దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక యువకుడు కూడా ఏకంగా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టుతో మేకప్ వేయించుకుని ఇక అచ్చం అందమైన అమ్మాయి లాగే మారిపోయాడు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి