జాబ్ లేకఓయినా..జాబ్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నా.. పార్ట్ టైం డబ్బుల కోసం అయిన ఈ మధ్యకాలంలో చాలా మంది ర్యాపిడో ని చూస్ చేసుకుంటున్నారు. అయితే కొందరు ర్యాపిడో డ్రైవర్స్ సాఫ్ట్ గా ఉంటే..మరికొందరు మాత్రం బాగా రూడ్ గా మాట్లాడుతూ ఉంటారు.  ట్యాక్సీ డ్రైవర్లే కాదు ర్యాపిడో స్కూటర్ డ్రైవర్లు కూడా ఓవరాక్షన్ ఎక్కువగా చేసేస్తూ ప్రయాణికుల పట్ల పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అంటూ జనాలు మాట్లాడుకునేలా మరొక ఘటన సోషల్ మీడియాలో వీడియో రూపంలో వైరల్ అవుతుంది.
 

ర్యాపిడో స్కూటర్ డ్రైవర్ రాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్న కారణంగా అతగాడిని నిలదీసింది ప్రయాణికురాలు. దీంతో అతగాడికి కోపం వచ్చింది. ఇద్ద్రి మధ్య మాట మాట పెరగడంతో వాళ్ళిద్దరి మధ్య పెద్ద వారే జరిగింది . దీంతో ఆ రాపిడో డ్రైవర్ కోపంతో ఆవేశంతో పక్కనే ఉన్న ఆ అమ్మాయిని లాగిపెట్టి కొట్టాడు . దీంతో అమ్మాయి కింద పడిపోయింది అయినా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తూ సినిమాల ఎంజాయ్ చేశారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు ..? ఏమిటి..? అన్న విధంగా ఆ రాపిడో డ్రైవర్ ని ప్రశ్నించలేదు .



దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఈ నెల 14వ తేదీ జరిగినట్లు తెలుస్తుంది . ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది . ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కేవలం ఈ ఒక్కటే కాదు గతంలో కూడా రాపిడో డ్రైవర్ చాలా చాలా రేష్ బిహేవియర్ తో మాట్లాడారు అంటూ ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా తమ బాధను వెళ్ళగక్కారు . ఇప్పుడు ఏకంగా ఈ రాపిడో డ్రైవర్ ఒక అమ్మాయిని లాగిపెట్టి కొట్టాడు . ఆ దెబ్బకి అమ్మాయి కింద పడిపోవడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది.  దీనితో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది..!!



మరింత సమాచారం తెలుసుకోండి: