సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు ఘాటు పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను పక్కన పెడితే ఊరుకునేది లేదని స్పష్టంగా హెచ్చరించారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించకపోతే రైతులతో కలిసి భారీ పాదయాత్ర చేపడతామని హరీశ్ రావు హుంకారించారు.యాసంగి సీజన్‌లో సగం మంది రైతులకు రైతుబంధు సహాయం పూర్తిగా నిలిపివేశారని ఆరోపించారు.

సాగు చేసిన భూమికే రైతుబంధు ఇస్తామంటూ దాదాపు డెబ్భై లక్షల ఎకరాలకు ఎసరు వేశారని ఆగ్రోశం వ్యక్తం చేశారు. సోయాబీన్, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది రోజులు దాటినా రైతులకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదని ధ్వజమెత్తారు. ఈ పరకంగా రైతులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.చేతలు చూపిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అని హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రైతు సంక్షేమంలో బీఆర్ఎస్ పాలనలో ఎన్నో కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం రైతులకు చేస్తున్న ఈ ద్రోహాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తేనే రైతుబంధు భవిష్యత్తు సురక్షితమని హరీశ్ రావు ప్రకటించారు. లేకపోతే రైతుబంధు పథకం పూర్తిగా బంద్ అవుతుందని రైతులకు అప్రమత్తం చేశారు. నారాయణ్‌ఖేడ్ పర్యటనలో ఆయన మాటలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. రైతు సమస్యలపై బీఆర్ఎస్ మళ్లీ ఉద్యమ రూపం తీ తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: