అయితే, ఈ విషయం ఇంకా చల్లారకముందే… మరో వార్త సోషల్ మీడియాలో జెట్ స్పీడ్‌లో వైరల్ అవుతోంది. అదేంటంటే—అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా తగ్గించుకున్నారు అన్న ప్రచారం. మరి ఇంత పెద్ద స్టార్ హీరో ఎందుకు అకస్మాత్తుగా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారు? అని అందరూ సందేహించడం సహజం. దీని వెనుక కారణం ఐ బొమ్మ రవి అరెస్ట్‌నే అంటూ మరో న్యూస్ బయటకు వచ్చింది. ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఆయనను సామాన్య ప్రజలు “దేవుడు లాంటి వ్యక్తి… ప్రజల కోసం మాట్లాడే వాడు” అని పొగడటం మొదలయ్యింది. సినిమా టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో, బిగ్ స్టార్లు 100–150 కోట్ల పారితోషికం తీసుకుంటే… ఆ బారం మొత్తం ప్రజలపై పడుతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి.
‘‘హీరోలు ఇంత రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటే… మేకర్స్ టికెట్ రేట్లు పెంచడమే తప్ప ప్రత్యామ్నాయం ఉండదు. ప్రజలే బాధపడాల్సి వస్తుంది’’ అని కొందరు నెటిజన్లు కౌంటర్లు వేస్తూ, తెగ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, తన లెవెల్‌కు అతీతంగా ఒకటే కాదు… ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే—ఈ సినిమా కోసం ఇప్పటికే అగ్రిమెంట్ కూడా రాసేసుకున్నారట. కానీ ప్రజలలో వస్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దానిని మార్చి… కొత్త అగ్రిమెంట్ రాయించుకుని, 150 కోట్లకు బదులుగా 100 కోట్లే తీసుకుంటాను అని బన్నీ చెప్పారట.
సాధారణంగా ఏ స్టార్ హీరో ఒకసారి అగ్రిమెంట్ రాసుకున్నాక ఇలా మధ్యలో మార్చడం చాలా అరుదు. ప్రత్యేకంగా, రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం మరీ అసాధారణం. కానీ అల్లు అర్జున్ మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం సినీ ఇండస్ట్రీలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వరకు… ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో జెట్ స్పీడ్‌తో వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు, సినిమా వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి