తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల పరిపాలనను ఘనంగా జరుపుకోవడానికి విస్తృత కార్యక్రమాలు రూపొందించింది. డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణ రైజింగ్ సదస్సుకు రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్ట్టి విక్రమార్క ఈ కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

మొదటి రోజు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రెండవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్యక్రమాలు జరుగుతాయి. మూడవ తేదీన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకేసారి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఐదవ తేదీన వరంగల్ జిల్లా నర్సంపేటలో, ఆరవ తేదీన నల్గొండ జిల్లా దేవరకొండలో కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో సంబంధిత ఉమ్మడి జిల్లాల మంత్రులు ప్రధాన అతిథులుగా పాల్గొంటారు.డిసెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన కొత్త ప్రకటనలు చేస్తారు.

ఎనిమిది, తొమ్మిది తేదీల్లో రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలోని ప్రముఖులు, వివిధ రంగాల నిష్ణాతులను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు.తొమ్మిదవ తేదీన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను అధికారికంగా విడుదల చేస్తారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలు ఈ డాక్యుమెంట్‌లో ఉంటాయి. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులు పాల్గొని సూచనలు ఇస్తారు. రెండేళ్ల పరిపాలన ఘనతను ప్రజల్లోకు తీసుకెళ్తూ రాబోయే లక్ష్యాలను ప్రకటించే ఈ ఉత్సవాలు రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: