సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా పేరు సంపాదించిన నటి హేమ గురించి పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో చిత్రాలలో అద్భుతమైన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది హేమ. అయితే ఈ మధ్యకాలంలో తక్కువగా సినిమాలలో కనిపిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల నటి హేమ తల్లి మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ ఎమోషనల్ గా మాట్లాడింది.



యాంకర్ ఇలా ప్రశ్నిస్తూ ఈ మధ్యకాలంలో మీ అమ్మగారు మరణించారు? ఎలా అనిపిస్తోంది అంటూ ప్రశ్నించగా? అందుకు హేమా మాట్లాడుతూ.. అమ్మని నేను నా తమ్ముడు చాలా బాగా చూసుకుంటాం! కేవలం నామీద వచ్చిన ఒక ఫేక్ న్యూస్ చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. నా జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను.. నా పర్సనల్ లైఫ్ కానీ ,ఇండస్ట్రీలో కానీ, మ్యారేజ్ లైఫ్ లో ఫ్యామిలీ లైఫ్ లో ఎక్కడా కూడా నా పైన ఒక్క రిమార్క్ కూడా లేదు. రాజకీయాలలో కూడా పోటీ చేసినప్పటికీ నాకు అక్కడ మంచి పేరు ఉందని తెలిపింది హేమ.


కానీ ఒక ఫేక్ న్యూస్ ని ప్రతిసారి పెద్దపెద్ద చానెల్స్ లో ప్రచారం చేశాయి.. అసలు నిజం ఏంటని తెలుసుకోకుండానే టెలికాస్ట్ చేశాయి. ఈ విషయంపై చాలామంది ట్రోల్ చేశారు. ఈ విషయాలన్నీ చూసిన మా అమ్మ చాలా డిప్రెషన్ లోకి వెళ్లడం వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేది. దీంతో అమ్మను ఆసుపత్రిలో చేర్పించాము అక్కడి నుంచి మా అమ్మ చాలా మానసికంగా చితికిపోయిందని అప్పుడే అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. కేవలం 16 నెలలలోనే రెండు మూడు సర్జరీలు కూడా జరిగాయని, కానీ చివరికి  గుండెపోటు రావడంతో తల్లి మరణించిందని, నావల్లే మా అమ్మ బాధతో మరణించారనే ఫీలింగ్ నన్ను ఇప్పటికీ బాధిస్తోందంటూ హేమ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: