తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త మంత్రాన్ని ప్రకటించారు. క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు పదాలతో కూడిన విధానాలు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు అంశాల చుట్టూ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందుతుందని వెల్లడించారు. రైతులను అభివృద్ధి ప్రక్రియలో పూర్తి భాగస్వాములను చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.ఆదాయం పెంచి పేదలకు పంచే విధానం ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

క్యూర్, ప్యూర్, రేర్ పాలసీలు అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా నిలపాలనేది రేవంత్ రెడ్డి సంకల్పం. రైతు నుంచి పారిశ్రామికవేత్త వరకు అందరినీ ఈ ప్రయాణంలో భాగం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కొత్త దిశ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

న్యూట్రిషన్ స్థాయి పెంచి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెరిగితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనేది ప్రభుత్వ దృక్పథం.ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉందని సీఎం పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ వాటాను పది శాతానికి చేర్చేలా కసరత్తు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యం పెటిష్టంగా ఉందని వివరించారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: