రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగ మారిన విషయం ఐ బొమ్మ రవి.. ముఖ్యంగా పైరసీ ద్వారా సినిమాలను ఐ బొమ్మ, బప్పం వంటి వెబ్సైట్లో ఉంచి సినీ ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చారు. దీంతో ఎట్టకేలకు హైదరాబాద్ కి వచ్చిన రవిని పోలీసులు సైతం పట్టుకొని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అరెస్ట్ అనంతరం కొంతమంది రవికి మద్దతు పలకగా మరి కొంతమంది రవిని శిక్షించాలంటూ కోరుతున్నారు.ఇటువంటి తరుణంలోనే రవి పై సిపిఐ నేత నారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.


తాజాగా ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఐ బొమ్మలో తాను ఫ్రీగా సినిమాలు చూశాననే విషయం చెప్పగా హాట్ టాపిక్ గా మారింది. ఆరేడు వందల రూపాయలు పెట్టి సినిమాలు ఎలా చూసేదని అందులో చూశాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తున్నారని తెలిపారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్నటువంటి రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే అంటూ కూడా ఆయన అసంతృప్తిని తెలియజేశారు. ఈ వ్యవస్థలో ఉండే లోపాలు సరి చేయకుండా ఉంటే ఇలాంటి రవిలు ఎంతో మంది పుట్టుకొస్తారని, ఒక హిడ్మా ను చంపితే వంద మంది హిడ్మాలు పుడతారంటూ  సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.


ఒక ఐ బొమ్మ రవిని చంపిన, జైల్లో వేసిన మరో వంద మంది పుట్టుకొస్తారని తెలియజేశారు. ఐ బొమ్మ రవి లాంటి వారికి ఉరివేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు సినిమా మాఫియానీ ఉరితీస్తేనే సమాజానికి ఉపయోగ ఉంటుందని తెలియజేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి చివరికి టికెట్ల ధరలు కోసం అడుక్కుంటున్నారని , సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయా? అంటూ నిలదీశారు సిపిఐ నేత. ఇలా కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారందరినీ కూడా ఐ బొమ్మ రవి దెబ్బ కొట్టారు అంటూ మాట్లాడారు. మరి ఈ విషయంపై అటు ఇండస్ట్రీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: