మన ఈ లోకంలో ఏమి జరిగినప్పటికీ లేదా మన వ్యక్తిగత జీవితములో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ నిబ్బరంగా ముందుకు సాగక తప్పదు. జీవితమన్నాక ఆటు పోట్లు తప్పవు. కష్ట నష్టాలు రాకుండా ఉండవు. అలాగని సమస్యలు వస్తే కృంగిపోకూడదు, ఉన్నచోటనే ఆగిపోకూడదు. ఏది ఏమైనా ముందుకు సాగాలి.