ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలనే అనుకుంటారు. ఎవ్వరూ కూడా మేము నాశనం అయిపోవాలి అని అనుకోరు. కానీ ఈ విజయం ఎవరి చుట్టమూ కాదు, మీ చెంతనే ఉండడానికి. అది కొన్ని అర్హతలు ఉన్న వారి చెంతనే ఉంటుంధి. అయితే విజయాన్ని కావాలి అనుకున్న వారు కొని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ మన ప్రయత్నంలో ఎటువంటి లోపమా లేకుండా ఉంటే ఆటోమేటిక్ గా విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మన పని మానము సక్రమంగా చేసుకుని వెళితే చాలు మిగతా విషయాలు ఏమీ ఆలోచించకూడదు.

అయితే ఇలా కాకుండా కొంత మంది కొన్ని రకాల భావనలకు లోనవుతుంటారు. ఈ పని చేస్తే వారు ఏమి అనుకుంటారో ? వాళ్ళేమైనా అంటారేమో ? అయితే ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం వలన సంస్యమంతా వృధా అవడమే తప్పా ? ఉపయోగం ఏమీ ఉండదు.  మీకున్న కొద్దిపాటి తెలివి తేటలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నింటినీ కట్టి పడేసి, మీరు అసలు ఏమి అనుకుంటారో ఆ పనిని దైర్యంగా చేయండి. ఆ పనిని సాధించడానికి ఎంతదూరమైనా వెళ్ళండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తెరగండి.

మీ విషయంలో ఎవ్వరైనా ఏదైనా పొరపాట్లను చెబితే ఆనందంగా స్వీకరించండి. వారు చెప్పిన విషయంలో అవసరమా ఏదైనా ఉంది అనుకుంటే, దానిని తీసుకోండి. మిగతా చెత్త విషయాలను వదిలేయండి. అలాగే మీరు ఎదుటి వారిలో తప్పులను ఎట్టి పరిస్థితుల్లో వెతక్కండి. ఏది ఏమైనా చిట్ట చివరికి మీ విషయంలో మీరే న్యాయనిర్ణేతలు ? మీరే విజయానికి అర్హులని నమ్మండి. నువ్వు ముఖ్యంగా వేరే వారిలాగా ఉండడానికి ప్రయత్నించకు. నీ బ్రతుకు నీదే, నీకు ఎలా నచ్చుతుందో అలాగే జీవించు. నీ శక్తిని నువ్వు నమ్ముకుని ఏ పనిచేసిన అందులో విజయం నీదే అవుతుంది. కాబట్టి మీరు ఏమిచేసినా అది మీ విజయం కోసమని నమ్మండి. ఎవ్వరూ ఎవరికి వారు చెడిపోయావాలని అనుకోరు.






 

మరింత సమాచారం తెలుసుకోండి: