జీవితంలో లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పొరపాట్లు చేయడం సహజం. కానీ మనం చేసిన ఆ పొరపాట్లను గుణ పాఠాలు అనుకుని అందులో నుండి మెళుకువలను తెలుసుకుని నడుచుకున్న వారే అనుకున్నది సాధిస్తారు. చాలా మంది తాము కోరుకున్న గమ్యాన్ని ఎలాగైనా చేరుకోవాలని, అందు లోనూ త్వరగా చేరుకోవాలని అనుకుని కొన్ని పొరపాట్లను చేస్తుంటారు, అది సహజమే అయితే ఆ పొరపాట్లను చూసి చూడనట్లు వదిలేసి మళ్ళీ పరుగులు తీయడం కాదు. ఆ పొరపాట్లు ఎలా జరిగాయి అందు వలన మనకు జరిగిన నష్టం ఏమిటి ? మరో సారి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి ? అన్న ప్రశ్నలు మీలో తలెత్తాలి.

అలా వాటి గురించి తెలుసుకుని మరింత దృఢంగా , క్లియర్ గా అవడం వలన మీ పయనం మరింత సులభతరం అవుతుంది. అనుకున్నది సాధించడానికి ఆ గుణ పాఠాలు మనకు మరింతగా ఉపయోగపడుతాయి. అనుభవం మనల్ని మరింత దృఢంగా చేస్తుంది, మార్గాన్ని సులభ తరం చేస్తుంది, అంతేకాదు ఇక ఇది మన వల్ల జరిగే పని కాదు అన్న సమస్యాత్మక పరిస్థితుల నుండి సునాయాసంగా బయట పడి ముందుకు సాగేందుకు మార్గం చూపుతుంది. అనుభవానికి మించిన జ్ఞానం మరొకటి ఉండదు. పొరపాటు జరగడం తప్పు కాదు ఆ పొరపాటును మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలి .

అందుకు ఆ పొరపాటు గురించి తెలుసుకుని సరిదిద్దుకోవాలి. మనిషి ఎప్పుడూ ఒక నిరంతర విద్యార్థి లాగే ఉండాలి. ప్రతి అనుభవం నుండి నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది. అభ్యాసం ఎంత పెరిగితే భవిష్యత్తు అంత బాగుంటుంది. కాబట్టి మీకు జరిగే ప్రతి ఫెయిల్యూర్ నుండి ఏదో ఒక విషయం నేర్చుకోండి, ఆ విషయాన్ని మీ భవిష్యత్తులో ఎక్కడ అవసరం అనిపిస్తుందో అక్కడ ఉపయోగించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: