
అమ్మ ఒక చిన్నారికి జీవితాన్ని ఇచ్చే నిజమైన కళ్లకు కనిపించే దేవత. ఆమె బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.. కష్టసుఖాలలో తోడుంటుంది. తల్లి ప్రేమ ముందు ఏదీ ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరికి తల్లే మొదటి ఇన్స్పిరేషన్.
అమ్మలేని లైఫ్ ఊహించుకోలేనిది. కొంతమందికి అమ్మ తనువు ప్రసాదిస్తే మరి కొందరికి జీవితాన్ని ప్రసాదించేస్తుంది. అలాంటి వారిలో ఒకరే కోటిరెడ్డి సరిపల్లి. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిందే . నేడు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ కోటిరెడ్డి సరిపల్లి అందరికీ సుపరిచితులే. ప్రపంచం మెచ్చేలా ఆయన ఎదగడం .. ప్రపంచ స్థాయి టెక్నాలజీ నిపుణుడిగా ఆయన రాణించడం వెనుక అక్షరాల ఉన్నది అమ్మ. అమ్మ చేతి చలువ కోటిరెడ్డికి బాగా తెలుసు . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ఆయనకు తెలిసినంత విధంగా మరి ఎవరికి తెలియదు అనడంలో కూడా అతిశయోక్తి లేదు . పదో తరగతి పూర్తయిన తర్వాత తన కలల సహకారం కోసం తపించిన కోటిరెడ్డికి చిన్నవయసులోనే చేయి ఇచ్చి పైకి వచ్చేందుకు సహాయపడింది మాతృమూర్తి.
మట్టిని నమ్ముకుని కాయ కష్టం చేసుకుని ముందుకు వెళ్లే కుటుంబం లో పుట్టిన కోటి రెడ్డి ..మొదట నుండి చదువు పై ఆసక్తి ఎక్కువుగా ఉండేది. బాగా చదువుతున్నా..పై చదువులు చదివించే స్తోమత నాన్నకి లేక ఇబ్బంది పడుతున్న ఆ సమయంలోనే తన కలను నిజం చేసుకునేందుకు కోటిరెడ్డి చేసిన ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అయ్యింది. పండగకు బట్టలు కొనుక్కునేందుకు వాళ్ళ అమ్మ ఇచ్చిన ₹1000 డబ్బులను 1000 మంది దేవతల ఆశీర్వాదంగా తీసుకుని కోటి ముందడుగు వేశారు .
ఆ 1000 పెట్టుబడిగా పెట్టి ఆయన వేసిన అడుగులు ఇప్పుడు ఆయనను టెక్నాలజీ వైపు పరుగులు పెట్టించాయి . ఆయన పేరు నలుగురికి తెలిసేలా చేశాయి . అమ్మ ఇచ్చిన ₹1000 పెట్టుబడితో పీజీడీసీఏ నేర్చుకుని కంప్యూటర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కోటిరెడ్డి .. ఆ తర్వాత కొన్ని ఏళ్లు తన కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడ్డాడు . అమ్మ ప్రోత్సాహం అమ్మ ఇచ్చిన ఆర్థిక ఊతం ఆయన లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకునేందుకు సహాయపడింది. జేబులో 700 తో హైదరాబాదుకు వచ్చిన కోటి రెడ్డి ఇప్పుడు 14 కంపెనీలకు బాస్ గా ఎదిగారు అంటే...దాని వెనుక ఆయన పడ్డ కష్టం అర్ధం చేసుకోవచ్చు.
అంతేకాదు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. హైదరాబాద్ కి వచ్చినప్పుడు కోటి తెడ్డి జేబులో ఉండేది 700. ఆ రోజును ఆయన ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ వెంటనే ఆయన తన లక్ష్యసాధనలో మునిగి దాన్ని సాధించే వరకు పోరాడి ఇప్పుడు ఇంతటి హై స్థానాన్ని దక్కించుకోగలరు. దీన్నంతటికి కారణం అమ్మ . ఆమె ఇచ్చిన వెయ్యి రూపాయలు. అందుకే కోటిరెడ్డి జీవితంలో అమ్మ చాలా చాలా ప్రత్యేకం. అమ్మ దేవుడిచ్చిన వరం . అమ్మ ఇచ్చిన ఆ ₹1000 ఆయనను గుడివాడ నుండి ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం వరకు నడిపించేలా చేసింది . ఈ రోజు 14 కంపెనీలకు బాస్ చేయడంతో పాటు ఆయన ద్వారా కొన్ని వందల మందికి ఉపాధి కల్పించేందుకు కారణమైంది.