అమ్మతనానికి అర్థం చూపిన అమృతా మూర్తులు. ఇది కదా మహిళా శక్తి. గర్భిణీని భుజాలపై మోసుకుంటూ..దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. ఆ ప్రాంతానికి అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. దాంతో నలుగురు మహిళలు కలిసి నిండు గర్భిణిని దవాఖానకు ఎత్తుకెళ్లారు. వాస్తవానికి వారుండే గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్ళడానికి దారితెన్నూ లేదు. ఆ పరిస్థితుల్లో ఓ మహిళ ప్రసవ వేదన పడుతోంది. ఆ కొండ కొనల్లోని మారుమూల మహిళా లోకం ఒక్కటయ్యింది. అందులో భాగంగా ఇంద్రా సీత, తులసీ జానీ, బిరమ జానీ, కుమారి జానీ, సిందే జానీ, హికమే పూజారి, సిలా జానీ, పరమ జానీ, టీకే జానీ, ఎప్తా పూజారి, సిలా జానీ తదితరులు స్ట్రైచర్‌పై మీణంగిణి కూర్చోబెట్టి, భుజలపై మోస్తూ ఘాట్‌ రోడ్‌లో కొండ దిగి, మతలాపుట్‌ ఆస్పత్రికి చేర్చారు. 


విధిని ఎదురించడానికే సిద్ధమయ్యారు. వారి లోని అమ్మతనం మేల్కొంది.మహిళలు  ఆ నిండు చులాలిని తమ భుజాలపైకి ఎత్తుకున్నారు.  కొండ పైనుంచి ఆసుపత్రికి మోసుకు వచ్చారు. ఒరిస్సాలో ఇది  సంచలనంగా మారింది. కొరాపుట్‌ జిల్లా నారాయణపట్నం బ్లాక్‌ సమితి బిజాపూర్‌ పంచాయతీ ఉప్పరగొడితి గ్రామానికి చెందిన మీణంగి జానికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు స్థానిక ఆశ కార్యకర్తకు సమాచారం అందించగా.. ఆమె వెంటనే 102 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అయితే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్‌ చేరుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. 



ఆ ప్రాంతంలో ఉప్పర గొడితి, తొలగొడితి, మఝిగొడితి, ఉప్పర రంగపాణి, తొలరంగపాణి, కుతుడి తదితర గ్రామాలకు రహదారులు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో మహిళలు  స్ట్రైచర్‌పై మీణంగిణి కూర్చోబెట్టి, భుజలపై మోస్తూ ఘాట్‌ రోడ్‌లో కొండ దిగి, మతలాపుట్‌ ఆస్పత్రికి చేర్చారు. అక్కడ ఆమె పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, సకాలంలో తీసుకు రావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఎంతో కష్టానికి ఓర్చి, గర్భిణిని భుజాలపై మోస్తూ ఆస్పత్రికి చేర్చిన మహిళలను పలువురు ప్రశంసిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: