రోజులు మారాయి. ఇదివ‌ర‌క‌టికంటే జ‌నాలు చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. టెక్నాల‌జీ బాగా పెరిగింది. దీంతో వైద్య‌రంగంలో కూడా అనేక‌నేక మార్పులు వ‌చ్చాయి. గర్భనిరోధక పద్ధతులలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఈరోజుల్లో పెళ్లి అయిన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, పెళ్లి కాని పురుషులు, స్త్రీలు కలయిక తర్వాత గర్భం వద్దనుకుంటే అందుకు అనేక సులభమైన పద్ధతులు వచ్చాయి. ఇప్పుడిప్పుడే మన దేశంలో వీటిపై అవగాహన పెరుగుతోంది.

 

ఇంతకుముందు కూా గర్భధారణను నివారించడానికి అనేక సరళమైన మార్గాలున్నాయని చాలా మందికి తెలీదు.  గర్భ నిరోధకానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి. ఏమేమీ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మంది జంటలు శృంగారం మాత్రం నిత్యం కావాలని కోరుకుంటున్నారు. కానీ సంతానం విషయంకొచ్చేసరికి వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే వారు ఆర్థిక, కుటుంబ సమస్యలు ఇతర కారణాల వల్ల అని తెలుస్తోంది. కానీ ఇందుకోసం వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సరైన సమయంలో చర్యలు తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. సంభోగం తర్వాత గర్భం రాకుండా ఉండాలంటే గర్భనిరోధక పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ మధ్యన చాలా మంది మహిళలు కొన్ని రకాల పిల్స్ ను వేసుకుని గర్భధారణను నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతిసారీ ఇలా చేస్తే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక, ఇలా కాకుండా మరింత సులభమైన, సహజమైన పద్ధతులను పాటించాలి. పురుషులు సంభోగం సమయంలో కండోమ్ వాడితే మహిళలకు గర్భం రాకుండా నిరోధించవచ్చు.

 

సంభోగం తర్వాత స్త్రీలకు గర్భం రాకుండా ఉండేందుకు ఇదివరకు మహిళలకు మాత్రలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం పురుషులకు సైతం మాత్రలు మార్కెట్లో లభిస్తున్నాయని సమాచారం. ఇవి వేసుకుంటే కండోమ్ వేసుకోకుండా సంభోగంలో పాల్గొనవచ్చంట. కానీ ఇవి అంత ప్రామాణికమైనవి కావు అని అంతా సురక్షితం అని కూడా ఇంకా శాస్త్రవేత్తల ద్వారా నిరూపించబడలేదు. వైద్య నిపుణుల సలహాలు, సూచనలు మేరకు మహిళలు మెడిసిన్స్ తీసుకోవాలి. లేదంటే మీకు చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


స్త్రీలు సంభోగం తర్వాత మహిళలకు గర్భం రాకుండా ఉండేందుకు 48 గంటలలోపు ఓ పిల్ ను తీసుకోవాలి. ఈ పిల్ ఫలదీకరణ గుడ్డు యొక్క అమరికను అడ్డుకుంటుంది. దీని వల్ల స్త్రీలకు గర్భం రాకుండా వాయిదా వేసుకోవచ్చు. IUD లేదా ఇంట్రాటూరైన్ అనే పరికరం గర్భనిరోధక పద్ధతులలో సురక్షితమైనది. ఇది T- ఆకారంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలా ఉంటుంది. ఇది మహిళ గర్భాశయంలోకి చొప్పించబడుతుంది. వీటిని వైద్యుల సంరక్షణలోనే చేయించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: